గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : బుధవారం, 19 జులై 2017 (10:38 IST)

భావనపై లైంగికదాడి కేసు : దిలీప్ మెడకు ఉచ్చు.. సాక్షిగా హీరో మాజీ భార్య

మలయాళ నటి భావన రేప్ కేసులో అరెస్టు అయిన మలయాళ స్టార్ హీరో దిలీప్ మాజీ భార్యను కేరళ రాష్ట్ర పోలీసులు ఓ సాక్షిగా పేర్కొన్నారు. దీంతో ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు సేకరించారు. హీరో దిలీప్‌ తొలుత మంజు వారియర

మలయాళ నటి భావన రేప్ కేసులో అరెస్టు అయిన మలయాళ స్టార్ హీరో దిలీప్ మాజీ భార్యను కేరళ రాష్ట్ర పోలీసులు ఓ సాక్షిగా పేర్కొన్నారు. దీంతో ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు సేకరించారు. హీరో దిలీప్‌ తొలుత మంజు వారియర్ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు విడాకులిచ్చి మరో యువతని వివాహం చేసుకున్నాడు. విడాకులు పొందిన తర్వాత మంజు వారియర్ తన మాజీ భర్తపై సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త ఓ క్రిమినల్ అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. 
 
ఈ నేపథ్యంలో భావన లైంగిక దాడి కేసులో మంజు వారియర్‌ను విచారించారు. ఈ కేసులో సాక్ష్యాధారాల సేకరణలో భాగంగా సిట్ తాజాగా ఆమె స్టేట్‌మెంట్‌ను సేకరించారు. అయితే సిట్ అధికారులు దీనిని అధికారికంగా వెల్లడించేందుకు నిరాకరించారు. 
 
మరోవైపు ఈ కేసులో దిలీప్‌కు బెయిల్ మంజూరు చేయాలని ఆయన న్యాయవాది రామ్ కుమార్ ఇటీవల కోర్టుకు పిటీషన్ దాఖలు చేశారు. అయితే దిలీప్‌కు బెయిల్ మంజూరుచేస్తే సాక్ష్యాలు నాశనం చేసే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.