సోమవారం, 13 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 31 జనవరి 2017 (12:47 IST)

ముంబై మోడల్స్‌కు అల్లు అర్జున్ సీరియస్ వార్నింగ్.. నా గెటప్ లీకైతే తాట తీస్తా..!

ప్రస్తుతం సెల్ఫీ పిచ్చి అంతా ఇంతా కాదు. సెల్ఫీలు తీసుకోవడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. డేంజర్ జోన్‌లలో నిలబడి సెల్ఫీలు తీయడంతో పాటు సెలెబ్రిటీలతో కలిసి సెల్ఫీలు తీసుకునేందుకు జనం ఎగబడుతున్నారు. అయితే ఈ

ప్రస్తుతం సెల్ఫీ పిచ్చి అంతా ఇంతా కాదు. సెల్ఫీలు తీసుకోవడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. డేంజర్ జోన్‌లలో నిలబడి సెల్ఫీలు తీయడంతో పాటు సెలెబ్రిటీలతో కలిసి సెల్ఫీలు తీసుకునేందుకు జనం ఎగబడుతున్నారు. అయితే ఈ సెల్ఫీ ఫీవర్ మోడల్స్‌కు పట్టుకుంది. మోడల్స్‌ సెల్ఫీ పిచ్చికి చెక్ పెట్టాలనుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వారికి వార్నింగ్ ఇచ్చాడు. అల్లు అర్జున్‌ ప్రస్తుతం ‘దువ్వాడ జగన్నాథమ్‌’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 
 
ఈ సినిమా కోసం ఓ సంగీత్‌ సీన్‌ను షూట్‌ చేస్తున్నారట. అందుకోసం సంగీత్‌ సెట్‌ వేసి ఆ సీన్‌లో యాక్ట్‌ చేయడానికి కొంతమంది మోడల్స్‌ను పిలిపించారట. వారంతా షూటింగ్‌ గ్యాప్‌లో సంగీత్‌ సెట్‌లో సెల్ఫీలు తీసుకోవడం మొదలెట్టారట. బన్నీతో కూడా సెల్ఫీలకు ఎగబడ్డారట. దీంతో బన్నీకి కోపం వచ్చేసింది. సంగీత్ సెట్ గురించి.. తన గెటప్ గురించి బయటకు లీక్ కాకూడదని.. ఎవ్వరూ ఇక్కడ సెల్ఫీలు తీసుకోవడానికి వీల్లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు సినీ పండితులు అంటున్నారు.