సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : శనివారం, 22 జులై 2017 (17:10 IST)

పాతహీరోను పట్టుకున్న అమలాపాల్? హైవేలో దొంగలించి?

పాత హీరోతోనే మళ్ళీ జతకట్టేందుకు రెడీ అవుతోంది.. అమలాపాల్. ఇప్పటికే అమలాపాల్ నటించిన వీఐపీ2, భాస్కర్ ఒరు రాస్కెల్ అనే రెండు తమిళ సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. తాజాగా నివిని పాలితో అమ్మడు జతకట్టను

పాత హీరోతోనే మళ్ళీ జతకట్టేందుకు రెడీ అవుతోంది.. అమలాపాల్. ఇప్పటికే అమలాపాల్ నటించిన వీఐపీ2, భాస్కర్ ఒరు రాస్కెల్ అనే రెండు తమిళ సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. తాజాగా నివిని పాలితో అమ్మడు జతకట్టనుంది. నివిన్ పాలి- అమలా పాల్ ''మిలి" అనే సినిమాలో 2015లో నటించారు. తాజాగా వీరిద్దరూ మరో సినిమాలో నటించనున్నారు.
 
 19వ శతాబ్ధంలో జీవించిన ఓ వ్యక్తి కథ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. రియల్ ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో హీరోయిన్‌గా అమలా పాల్ నటించనుంది. హైవేలో ప్రయాణించే ధనికుల నుంచి నగదు దొంగలించి.. పేదలకు ఇచ్చే వ్యక్తిగా నివిన్ పాలి నటిస్తుండగా.. ఆతనిని ప్రేమించే అమ్మాయిగా అమలా పాల్ నటిస్తోంది.