శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : సోమవారం, 16 జనవరి 2017 (09:20 IST)

ఆ హీరోయిన్ కత్తిలా ఉంది.. ఆమెనే బుక్ చేయండి.. నిర్మాతను కోరిన కొత్త డైరక్టర్!

తెలుగు చిత్ర పరిశ్రమతో అనుబంధం ఉన్నప్పటికీ.. దర్శకత్వం చేస్తున్నది మాత్రం మొదటి చిత్రమే. ఆయన పేరు హర్షవర్ధన్. నటుడు, రచయిత కూడా. ఈయన తొలిసారి దర్శకత్వం వహించనున్నారు. ఈయన తీసే చిత్రంలో ఓ కుర్ర నటినే హ

తెలుగు చిత్ర పరిశ్రమతో అనుబంధం ఉన్నప్పటికీ.. దర్శకత్వం చేస్తున్నది మాత్రం మొదటి చిత్రమే. ఆయన పేరు హర్షవర్ధన్. నటుడు, రచయిత కూడా. ఈయన తొలిసారి దర్శకత్వం వహించనున్నారు. ఈయన తీసే చిత్రంలో ఓ కుర్ర నటినే హీరోయిన్‌గా ఎంపిక చేయాలని నిర్మాతపై ఒత్తిడి తెస్తున్నాడట. ఎందుకంటే ఆమె కత్తిలా ఉందని, ఆమె అయితేనే తన కథకు అతికినట్టు సరిపోతుందని నిర్మాతతో చెపుతున్నారట. ఇంతకీ ఆ కత్తిలాంటి హీరోయిన్ ఎవరో కాదు.. శ్రీముఖి. 'పటాస్' షోతో పాపులరయిన యాంకర్. 
 
వెండితెరపై కూడా మెరిసింది. ప్రేమ ఇష్క్ కాదల్‌లో హీరోయిన్‌గా పరిచయమైన శ్రీముఖి తర్వాత త్రివిక్రమ్ "జులాయి"లో కనిపించింది. ఈ మధ్యనే వచ్చిన నాని "జెంటిల్‌మెన్‌"లో కూడా జర్నలిస్ట్ గా దర్శనమిచ్చింది. అయితే ఆమె సినిమా ప్రయాణం పెద్దగా వర్కవుట్ కాలేదనే చెప్పాలి.
 
ఈనేపథ్యంలో ఆమెకు ఓ బంపర్ ఆఫర్ తగిలింది. హర్షవర్ధన్ త్వరలో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న చిత్రంలో శ్రీముఖిని హీరోయిన్‌గా ఫిక్స్ చేసాడట. శ్రీముఖి ఈ మూవీలో సోలో హీరోయిన్‌గా చేయనుందని టాక్. ఇది 80ల నాటి రొమాంటిక్ థ్రిల్లర్ అని టాక్ వినిపిస్తోంది. 'గుడ్.. బ్యాడ్.. అగ్లీ' అనేది ఈ సినిమా వర్కింగ్ టైటిల్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 
 
'ప్రేమ ఇష్క్ కాదల్'తో పాటు 'లక్ష్మీదేవి తలుపు తట్టింది, మీలో ఒకడు, చంద్రిక లాంటి సినిమాలు చేసింది శ్రీముఖి. అయితే ఇది ఆశించిన ఫలితాల్ని ఇవ్వలేదు. మరి హర్షవర్ధన్ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.