'బాహుబలి-2' చిత్రానికి యు/ఏ సర్టిఫికేట్... సూపర్బ్ అన్న సెన్సార్ సభ్యులు!
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం 'బాహుబలి-2' ది కంక్లూజన్ చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికేట్ మంజూరు చేసినట్టు సమాచారం. నిజానికి 'బాహుబలి'
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం 'బాహుబలి-2' ది కంక్లూజన్ చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికేట్ మంజూరు చేసినట్టు సమాచారం. నిజానికి 'బాహుబలి' చిత్రం మొదటి భాగం విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రం రెండో భాగం కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసున్నారు. ముఖ్యంగా 'బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపారన్న ప్రశ్నే ప్రతి ఒక్కరి మెదళ్లను తొలుస్తూ వస్తోంది.
ఈ క్రమంలో గత యేడాదిన్నర కాలంగా ఎన్నో కష్టనష్టాలకోర్చి.. భారీ బడ్జెట్‌తో, భారీ విజువల్ గ్రాండియర్‌తో, తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గ్రాండ్‌గా ఈ చిత్రం రెండో భాగాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం సోమవారం సెన్సార్ పూర్తైందని టాక్. దీనిపై అధికారిక సమాచారం ఏమీ లేకున్నా.. ఫిల్మ్‌నగర్ సర్కిల్స్ ప్రకారం ఏప్రిల్ 17న చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చినట్టు తెలుస్తోంది. 'బాహుబలి-2'కి సెన్సార్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టు సమాచారం. సినిమా చాలా బాగుందని సెన్సార్ సభ్యులు అన్నట్టు తెలుస్తోంది.
కాగా, తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆయా భాషల్లోనూ సెన్సార్ బోర్డు క్లియరెన్స్ కోసం 'బాహుబలి' చిత్రం వేచి చూస్తోందట. కాగా, ఈ చిత్రం ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.