ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శనివారం, 21 జనవరి 2017 (09:10 IST)

టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ పెళ్ళి ఎపుడంటే...? క్లారిటీ లేకుండా సంకేతాలిచ్చిన కృష్ణంరాజు!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోల్లో మోస్ట్ బ్యాచిలర్ ప్రభాస్. ఈయన వయస్సు 38 యేళ్లు. ఈ యంగ్ హీరో దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి నిర్మిస్తున్న బాహుబలి చిత్రం కోసం దాదాపు మూడున్నరేళ్లుగా శ్రమిస్తున్నారు. ఈన

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోల్లో మోస్ట్ బ్యాచిలర్ ప్రభాస్. ఈయన వయస్సు 38 యేళ్లు. ఈ యంగ్ హీరో దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి నిర్మిస్తున్న బాహుబలి చిత్రం కోసం దాదాపు మూడున్నరేళ్లుగా శ్రమిస్తున్నారు. ఈనేపథ్యంలో.. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో సుజిత్ దర్శకత్వంలో మరో చిత్రం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇదేసమయంలో ప్రభాస్ పెళ్లి అంశం తెరపైకి వచ్చింది. 
 
దీనిపై ఆయన పెద్దనాన్న సీనియర్ హీరో కృష్ణంరాజు మాట్లాడుతూ... ప్రభాస్‌ పెళ్లి ఈ ఏడాది ఖచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. ‘బాహుబలి-2’ విడుదల తర్వాత ప్రభాస్‌ పెళ్లి చేసుకుంటాడని చెప్పారు. తనకు తెలిసినంతవరకు సుజిత్‌ సినిమా మొదలు పెట్టేముందే పెళ్లి ఉండొచ్చని తెలిపారు. 
 
అయితే ఆ అమ్మాయి ఎవరో, ఏ ప్రాంతానికి చెందినదో మాత్రం చెప్పడానికి నిరాకరించారు. అన్ని వివరాలూ ‘బాహుబలి-2’ విడుదల తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. అయితే ఆ అమ్మాయి గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తి అని, ఆమెను ప్రభాస్‌ తల్లి ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి. సో... ప్రభాస్‌ పెళ్లి గురించి పూర్తి వివరాలు తెలియాలంటే ‘బాహుబలి-2’ విడుదల వరకు ఆగాల్సిందే.