శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : శనివారం, 5 ఆగస్టు 2017 (14:26 IST)

బిగ్‌బాస్: ఓవియా ఆత్మహత్యాయత్నం చేసిందా? #NooviyaNoBigboss అంటూ?

బిగ్ బాస్ తమిళ స్టార్ ఓవియా గురించే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది. ఓవియాను చికిత్స కోసం ఆస్పత్రిలో అడ్మిట్ చేశారని తెలుస్తోంది. మానసికపరమైన ఇబ్బందులతో ఆమెను ఆస్పత్రికి తరలించారన

బిగ్ బాస్ తమిళ స్టార్ ఓవియా గురించే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది. ఓవియాను చికిత్స కోసం ఆస్పత్రిలో అడ్మిట్ చేశారని తెలుస్తోంది. మానసికపరమైన ఇబ్బందులతో ఆమెను ఆస్పత్రికి తరలించారని సమాచారం. విజయ్ టీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ తమిళ కార్యక్రమం నుంచి బయటికొచ్చిన మాట నిజమేనని.. అయితే తిరిగి బిగ్ బాస్ షోకు వెళ్లేందుకు చర్చలు జరుగుతున్నాయని ఓవియానే స్వయం చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
కానీ మానసిక ఒత్తిడితో ఓవియా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని.. అందుకే ఆమెను బిగ్ బాస్ ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చి చికిత్స చేయిస్తున్నట్లు సమాచారం. బిగ్ బాస్ ఇంటి నుంచి ఓవియా బయటికొచ్చి కారులో వెళ్లే ఫోటో రిలీజైంది.
 
ఈ నేపథ్యంలో ఓవియాలేని బిగ్ బాస్‌ను చూసేది లేదంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇందులో భాగంగా నోఓవియానోబిగ్‌బాస్ (NooviyaNoBigboss) అంటూ హ్యాగ్ ట్యాగులు కూడా వచ్చేశాయి.