బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : బుధవారం, 2 ఆగస్టు 2017 (10:51 IST)

కేన్సర్ బాధపడుతున్న అల్లరి సుభాషిణి... ఆదుకున్న బిగ్‌బాస్ పార్టిసిపెంట్

అనేక తెలుగు చిత్రాల్లో నటించిన సుభాషిణి ఇపుడు కేన్సర్ వ్యాధితో బాధపడుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లరి సుభాషిణిగా గుర్తింపు పొందిన ఈమె.. అనేక వందల చిత్రాల్లో నటించింది. కానీ, కేన్సర్ బారినపడిన సంపా

అనేక తెలుగు చిత్రాల్లో నటించిన సుభాషిణి ఇపుడు కేన్సర్ వ్యాధితో బాధపడుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లరి సుభాషిణిగా గుర్తింపు పొందిన ఈమె.. అనేక వందల చిత్రాల్లో నటించింది. కానీ, కేన్సర్ బారినపడిన సంపాదించుకున్న నాలుగు రూపాయలు వైద్యానికే ఖర్చు పెట్టుకుంది. 
 
ఇపుడు వైద్య ఖర్చులకు లేక ఇబ్బందిపడుతోంది. ఈ విషయం తెలుసుకున్న బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గొని ఎలిమినేట్ అయిన నటి జ్యోతి తన వంతు ఆర్థిక సాయం చేసింది. ఈ షో నుంచి ఎలిమినేట్ కావడంతో జ్యోతికి టీవీ నిర్వాహకులు భారీ మొత్తంలో పారితోషికం ఇచ్చారు. ఈ మొత్తంలో ఎక్కువ భాగం అల్లరి సుభాషిణికి జ్యోతి ఇవ్వడం గమనార్హం.