బరువు తగ్గడానికి నానా తంటాలు పడుతున్న నిత్యామీనన్
నిత్యా మీనన్ డేర్ మనిషి పేరు కొట్టేసింది. రింగుల జుట్టు.. ఇట్టే ఆకట్టుకునే నటనతో ఫ్యాన్స్‌ను దగ్గర చేసుకున్న నిత్యామీనన్, కాస్త పొట్టిగా, కాస్త బొద్దుగా…. కానీ ప్లజెంట్ మొహంతో, మంచి నటనతో తెలుగునాట వ
నిత్యా మీనన్ డేర్ మనిషి పేరు కొట్టేసింది. రింగుల జుట్టు.. ఇట్టే ఆకట్టుకునే నటనతో ఫ్యాన్స్‌ను దగ్గర చేసుకున్న నిత్యామీనన్, కాస్త పొట్టిగా, కాస్త బొద్దుగా…. కానీ ప్లజెంట్ మొహంతో, మంచి నటనతో తెలుగునాట విపరీతమైన ఆదరణను సొంతం చేసుకుని ఎక్స్‌ప్లోజింగ్‌కు దూరంగా ఉండే నిత్య బరువు తగ్గడానికి నానా తంటాలు పడుతోందట. కథ నచ్చితే చాలు చిన్నా సినిమానా.. పెద్ద సినిమానా.. చిన్న పాత్ర, పెద్దా పాత్రా లెక్కలేవీ పట్టించుకోదు. నిత్యా నటించదు.. పాత్రలో జీవించేస్తోందనే అని చెబుతుంటారు దర్శక-నిర్మాతలు.
ఇటీవలే ''జనతా గ్యారేజ్''తో ఓ హిట్ అందుకొంది. తన పాత్ర కోసం ఏదైనా చేయడానికి రెడీ అయ్యే కొద్దిమంది కథానాయికల్లో నిత్యా ఒకరు. తాజాగా, నిత్యా ఓ పాత్ర కోసం సన్నబడేందుకు రెఢీ అయ్యింది. త్వరలోనే ఈ భామ వెంకటేష్ సరసన ఓ సినిమాలో నటించబోతోంది. దీంతో ఆ సినిమాలో తప్పకుండా నిత్య స్లిమ్ కావల్సిందేనని చెబుతున్నారట దర్శకనిర్మాతలు. అసలే మొన్న జనతా గ్యారేజ్‌లో బరువు పెరిగినట్టు కనిపించిన నిత్య, అలాగే ఉంటే మాత్రం కష్టమేనని దర్శకనిర్మాతలు కరాఖండీగా చెప్పారట.
స్లిమ్ కావటానికి నోరు కట్టేసుకుంటే మొహంలో కళ పోతుందనేది ఓ భయం… స్లిమ్ కాకపోతే నోరుకొట్టేసుకున్నట్టే అనేది మరో భయం… సో, నిత్యా… ఇక వ్యాయామాలు కానివ్వు… అని దర్శకనిర్మాతలు హెచ్చరిస్తున్నారట. ఈ విషయాన్ని ఆమెనే వెల్లడించింది. ''త్వరలో నటించబోయే ఓ సినిమా కోసం బరువు తగ్గుతున్నా.. ఇందుకోసం చాలా కఠినమైన ఆహార నియమాలు పాటిస్తున్నానని అంటోంది నిత్యా. ఇన్నాళ్లు బొద్దుగా ముద్దుగా ఉండే నిత్యా.. త్వరలోనే నాజుకు అందాలతో ప్రేక్షకులను కనువిందు చేయనుందన్నమాట.