1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Countdown to Peddi Special Screenings — Meanwhile, Doubts Loom Over a Possible Postponement?

Ramcharan: పెద్ది ప్రత్యేక ప్రదర్శనలకు కౌంట్‌డౌన్ - మరోవైపు వాయిదాపై అనుమానాలు ?

Peddi Bollywood poster
Peddi Bollywood poster
రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా ఇంతకుముందు ఉస్తాద్ గబ్బర్ సింగ్ సినిమా వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పెద్ది సినిమాను ఏప్రిల్ 30, 2026న విడుదల కానుందని నిర్మాతలు వెల్లడించారు. అయితే మరోసారి వాయిదా పడేసూచనలు కనిపిస్తున్నాయంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవలే చరణ్ కంటికి గాయమైంది. శస్త్ర చికిత్స చేశారంటూ చిరంజీవే స్వయంగా ప్రకటించారు. ఒకరోజు తర్వాత పెద్ది సెట్లో షూటింగ్ లో పాల్గొంటూ కేక్ కూడా కట్ చేశారు.
 
విశ్వసనీయ సమాచారం, పెద్ది సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ తోపాటు కొన్ని ప్యాచ్ వర్క్ షాట్స్ కూడా చిత్రీకరించాల్సి వుంది. వాటిని డూప్ తో చేయడానికి కుదరదట. అందుకు కొద్దిరోజులు టైం పడుతుందని తెలుస్తోంది. మరోవైపు సాంకేతిక పనులు కూడా ఇటు ఇండియాలోనూ విదేశాల్లోనూ జరుగుతున్నాయి. అన్నీ సవ్యంగా జరిగితే పెద్ది అనుకున్నటైంకు రిలీజ్ అవుతుందని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
 
ఎందుకంటే, ఇప్పటికే అఖిల్ అక్కినేని కూడా తన లెనిన్ సినిమాను పెద్ది సినిమా విడుదల వల్ల క్లాష్ వస్తుందని వాయిదా వేసుకున్నట్లు నిర్మాతలు ఇటీవలే తెలియజేశారు. మరి ఈ కొత్త ఊహాగానాలకు మరోసారి నిర్మాతలు క్లారిటీ ఇవ్వాల్సి వస్తుందని తెలుస్తోంది. దర్శకుడు బుచ్చిబాబుసానా కు ఈ సినిమా ప్రతిష్టాత్మకం కానుంది. 
 
అయితే అభిమానులు మాత్రం రిలీజ్ డేట్ పై ఆశగా ఎదురుచూస్తున్నారు. 1980ల నాటి గ్రామీణ ఆంధ్రప్రదేశ్ క్రీడా నేపథ్యం గల 'పెద్ది పెహల్వాన్స్ ప్రైడ్' చిత్రంలో చరణ్ ఒక శక్తివంతమైన రెజ్లర్‌గా కనిపిస్తున్న ఒక చిన్న గ్లింప్స్. అయ్యప్ప దీక్ష శాకాహార వ్రతం తీసుకున్న సమయంలో కూడా చరణ్ ఎనిమిది నెలల పాటు తెల్లవారుజామున వ్యాయామాలు చేయడం, కఠినమైన ఆహార నియమాలు పాటించడం వంటి వాటిని దర్శకుడు బుచ్చి బాబు సానా ప్రశంసించారు. జాన్వీ కపూర్, శివరాజ్‌కుమార్‌లు సహనటులుగా ఉన్న ఈ చిత్రం పట్ల గౌరవ సూచకంగా అఖిల్ అక్కినేని 'లెనిన్' తన విడుదల తేదీని మార్చుకుంది. అభిమానులు ప్రత్యేక ప్రదర్శనలు, కౌంట్‌డౌన్ ఎడిట్‌లతో ఈ చిత్రాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు.
About Writer
దేవీ
తర్వాతి కథనం
Niharika: విజయ్ దేవరకొండ తో రిలేషన్ షిప్ పై క్లారిటీ ఇచ్చిన నీహారిక కొణిదెల