శుక్రవారం, 27 జూన్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : మంగళవారం, 7 జూన్ 2016 (12:24 IST)

అమితాబ్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసిన ఫవాద్ ఖాన్

''ఖూబ్‌సూరత్‌'' చిత్రంతో తెరంగేట్రం చేసిన ఫవాద్‌ ''కపూర్‌ అండ్‌ సన్స్‌'' చిత్రంతో మంచిసక్సెస్ అందుకుని వరుస ఆఫర్లతో ముందుకు దూసుకెళ్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ పక్కన నటించే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు. అదీకాకుండా సల్మాన్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌లో వస్తున్న 'జుగల్‌బందీ' అమితాబ్, ఫవాద్‌ ఖాన్ కలసి గురు, శిష్యులుగా న‌టించ‌నున్నారు. 
 
గురువు, శిష్యుడి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గురువు, శిష్యుడి చుట్టూ తిరిగే ఈ సినిమాలో గురువు పాత్ర‌లో అమితాబ్, శిష్యుడి పాత్ర‌లో ఫవాద్‌ ఖాన్ న‌టించ‌డంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరోయిన్ ఎంపిక మిన‌హా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుంది.