బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: బుధవారం, 1 ఆగస్టు 2018 (12:47 IST)

శర్వానంద్‌తో సాయిపల్లవి డిష్యుం.. డిష్యుం.. షూటింగ్ ఆగిపోయిందట?

తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సాయిపల్లవి. ఆమె సినిమాల్లో అద్భుతంగా నటిస్తుందని అందరికీ తెలిసిందే. కానీ సాయిపల్లవి యాటిట్యూడ్‌తో హీరోలు ఇబ్బంది పడుతున్నారట. తాజాగా శర్వానంద్‌తో సాయిపల్లవి గొడవ పెట్టుకున్నారట. దీంతో వీరి

తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సాయిపల్లవి. ఆమె సినిమాల్లో అద్భుతంగా నటిస్తుందని అందరికీ తెలిసిందే. కానీ సాయిపల్లవి యాటిట్యూడ్‌తో హీరోలు ఇబ్బంది పడుతున్నారట. తాజాగా శర్వానంద్‌తో సాయిపల్లవి గొడవ పెట్టుకున్నారట. దీంతో వీరిద్దరు కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్ కూడా ఆగిపోయిందట. అసలు శర్వానంద్, సాయిపల్లవిలకు మధ్య ఏం జరిగింది. 
 
సాయిపల్లవి గురించి సినీ పరిశ్రమలో ఇప్పుడు ఒక విషయం చర్చ జరుగుతోంది. అందులో ప్రధానమైనది సెట్స్‌లో సాయిపల్లవి హీరోలకు చాలా ఇబ్బందులు సృష్టిస్తుందన్న ప్రచారం ఉంది. గతంలో నాని, నాగశౌర్య వంటి హీరోలతో గొడవ పడిందన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాగా శర్వానంద్‌తో కూడా అదే పని చేసిందట. 
 
శర్వానంద్, సాయిపల్లవిలు కలిసి పడిపడిలేచే అనే సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా కోల్‌కత్తాలో చాలా రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది. కోల్‌కత్తాలో షూటింగ్ జరుపుకునే సమయంలో సాయి పల్లవి, శర్వానంద్‌తో గొడవ పెట్టుకుందట. దాంతో సినిమా షూటింగ్ కూడా ఆగిందట. సాయిపల్లవి కావాలనే గొడవ పెట్టుకోవడం.. షూటింగ్ రాకుండా వెళ్ళిపోవడం లాంటివి చేస్తోందట. దీంతో శర్వానంద్ కూడా అలిగి పడిపడి లేచే సినిమా షూటింగ్‌కు రాకుండా వేరే సినిమా షూటింగ్ కు వెళ్ళిపోతున్నాడట. షూటింగ్ జరిగే సమయంలో కావాలనే గొడవకు దిగడం.. టేక్‌లు అస్సలు తీసుకోకూడదని చెప్పడం ఇలాంటి వాటితో శర్వానంద్, సాయిపల్లవిలకు మధ్య గొడవకు ప్రధాన కారణమవుతోందట. మరి సాయిపల్లవి తన యాటిట్యూడ్‌ను మార్చుకుంటుందో లేక ఇలాగే కొనసాగుతుందో వేచి చూడాల్సిందే.