శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 9 మే 2018 (16:28 IST)

#PadiPadiLecheManasuలో #SaiPallavi లుక్ ఇదే..

శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ''పడి పడి లేచే మనసు''. ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తుండగా, శ్రీలక్ష్మీ వేంకటేశ్వరా సినిమాస్

శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ''పడి పడి లేచే మనసు''. ఈ  సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తుండగా, శ్రీలక్ష్మీ వేంకటేశ్వరా సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి-ప్రసాద్ చుక్కపల్లి నిర్మిస్తున్నారు.


ఈ చిత్రానికి సంగీతం విశాల్ చంద్రశేఖర్ సమకూర్చుతున్నారు. ఈ సినిమాలోని శర్వానంద్ ఫస్ట్‌లుక్ ఆతని పుట్టినరోజైన మార్చి ఆరో తేదీన విడుదల చేశారు. తాజాగా హీరోయిన్ సాయిపల్లవి పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ చిత్రంలోని ఆమె ఫస్టులుక్‌ను విడుదల చేశారు. 
 
ఈ చిత్రంపై చిత్ర నిర్మాతలు సుధాకర్ చెరుకూరి-ప్రసాద్ చుక్కపల్లి స్పందిస్తూ.. "పడి పడి లేచే మనసు" సినిమా ఓ డిఫరెంట్ క్రియేటివ్ లవ్ స్టోరీ అన్నారు.  కోల్‌కతా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలోని కీలక యాక్షన్ సన్నివేశాలను వెంకట్ మాస్టర్‌ నేతృత్వంలో చిత్రీకరించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం, జయకృష్ణ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నాయి.