ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 16 అక్టోబరు 2016 (11:13 IST)

మహేష్ బాబు, మురుగదాస్ సినిమా టైటిల్ అదేనా? దీపావళికి ఫస్ట్ లుక్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మురుగదాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి మహేష్ మూవీ టైటిల్‌పై పలు రకాల పేర్లు వినిపించాయి. అయితే అవన్నీ రూ

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మురుగదాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి మహేష్ మూవీ టైటిల్‌పై పలు రకాల పేర్లు వినిపించాయి. అయితే అవన్నీ రూమర్స్ అని చిత్రయూనిట్ కొట్టి పారేస్తూ వస్తున్న మళ్లీ మళ్లీ అలాంటి రూవర్సే వినిపిస్తున్నాయి.
 
ఈ ప్రాజెక్ట్ మొదలైన సమయంలో మహేష్, మురుగదాస్ ల మూవీ టైటిల్ ఎనిమి అంటూ భారీ ప్రచారం జరిగింది. తరువాత వాస్కోడిగామా, అభిమన్యుడు లాంటి పేర్లు కూడా వినిపించాయి. అయితే తాజాగా మరో ఇంట్రస్టింగ్ టైటిల్ తెర మీదకు వచ్చింది. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమాకు రెండు భాషల్లో కామన్ టైటిల్ ఉండే విధంగా ఏజెంట్ శివ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. మరి ఈ టైటిల్ అయినా వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. ఈ సినిమా ఫస్ట్ లుక్ దీపావళికి రీలిజయ్యే అవకాశం ఉంది.