1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 6 జనవరి 2017 (11:48 IST)

బాలయ్య ఫ్యాన్స్‌కు ముందే సంక్రాంతి.. "గౌతమిపుత్రశాతకర్ణి"కి విడుదలకు ముందే హిట్ టాక్!

నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఈ దఫా ముందే సంక్రాంతి వచ్చింది. తమ అభిమాన హీరో బాలయ్య వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. ఈ చిత్రం ఈనెల 12వ తేదీ ప్రేక్షకుల ముందుకురానుంది.

నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఈ దఫా ముందే సంక్రాంతి వచ్చింది. తమ అభిమాన హీరో బాలయ్య వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. ఈ చిత్రం ఈనెల 12వ తేదీ ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సెన్సార్ కార్యక్రమం జరుగగా, ఒక్కటంటే ఒక్క కత్తెర కూడా పడకుండా సెన్సార్ సర్టిఫికేట్ లభించింది. పైగా.. చిత్ర యూనిట్‌ను సెన్సార్ బోర్డు సభ్యులు ప్రత్యేకంగా అభినందించారన్న టాక్ వినిపిస్తోంది. 
 
సాధారణంగా టాలీవుడ్ చిత్రపరిశ్రమలో కథనే హీరోగా చేసి సినిమాలను తెరకెక్కించే దర్శకుల్లో క్రిష్ ఒకరు. ఈయన శాతకర్ణికి దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమా పాటలు మంచి ఆదరణ పొందాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సింగిల్ కట్ లేకుండా సర్టిఫికెట్ ఇవ్వడం విశేషం.
  
సినిమా చూసిన అనంతరం సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్‌ను అభినందించారట. సినిమా అద్భుతంగా ఉందని కితాబిచ్చారట. దీంతో ఇప్పటికే ట్రైలర్‌ చూసి ఉబ్బితబ్బిబైన ఫ్యాన్స్ సెన్సార్ స్పందనతో మరింత సంబరపడిపోతున్నారు. సంక్రాంతి హీరో బాలయ్యేనని కన్ఫామ్ చేసేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ సినిమా కేవలం బాలయ్య ఫ్యాన్స్‌కే కాదు తెలుగు జాతికి కూడా ప్రపంచ వ్యాప్త గుర్తింపు తేవడం ఖాయంగానే కనిపిస్తోంది.