Mrunal Thakur: ధనుష్ తో పెండ్లి వార్తను ఖండించిన మ్రుణాల్ ఠాగూర్?
Mrunal Thakur, Siddhant Trivedi
సీతారామం సినిమాతో పేరు తెచ్చుకున్న కథానాయిక మ్రుణాల్ ఠాగూర్ గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు హల్ చల్ చేశాయి. తమిళ హీరో ధనుష్ తో వివాహ జీవితాన్ని పంచుకోనున్నదని టాక్. అందుకు ఫిబ్రవరి 14న ముహూర్తం కూడా పెట్టారని వచ్చాయి. కానీ దీని గురించి ఆమె టీమ్ స్పందిస్తూ.. అవన్నీ పుకార్లే. ప్రస్తుతం కెరీర్ పై నే ద్రుష్టి పెట్టిందని చెబుతున్నారు.
కాగా, నేడు మ్రుణాల్ ఠాగూర్ ఇన్ స్ట్రాలో బాలీవుడ్ నటుడు సిద్దాంత్ త్రివేది తో వున్న ఫొటో పెట్టింది. అతనితో చాలా చనువుగా వున్న ఆ ఫొటోను చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మ్రుణాల్ ఠాగూర్ అతనితో రిలేషన్ షిప్ లో వున్నారా? అంటూ కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. దే దివానేమో సెహెర్ హై అనే సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు. సంజయ్ లీలా బన్సాలీ, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆ ఫొటోలు బయటకు వచ్చాయి.