శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : బుధవారం, 16 ఆగస్టు 2017 (17:34 IST)

మణిరత్నం సినిమాలో చెర్రీ.. సారా అలీ ఖాన్‌తో రొమాన్స్?

రంగస్థలం సినిమాకు తర్వాత రామ్ చరణ్ తేజ ప్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమాలో నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ కుమార్తె సారా అలీ ఖాన్‌ని తీసుకోనున్నట్లు కోడంబా

రంగస్థలం సినిమాకు తర్వాత రామ్ చరణ్ తేజ ప్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమాలో నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ కుమార్తె సారా అలీ ఖాన్‌ని తీసుకోనున్నట్లు కోడంబాక్కం వర్గాలు కోడైకూస్తున్నాయి. 
 
ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో సమంతతో కలిసి రంగస్థలం సినిమాలో వెరైటీ రోల్ పోషిస్తున్న చెర్రీ.. మణిరత్నం చిత్రంలోనూ నటనతో అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. చెర్రీతో చేసే చిత్రాన్ని మణిరత్నం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. కానీ దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. 
 
చెలియా సినిమాకు తర్వాత చెర్రీతో చేసే సినిమాకు సంబంధించి మణిరత్నం ప్రీ-ప్రొడక్షన్ పనులు చేస్తున్నారని.. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందని సినీ జనం అంటున్నారు. ప్రస్తుతానికి రాంచరణ్‌, సుకుమార్‌లో ‘రంగస్థలం’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కి జంటగా సమంత నటిస్తోంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసేందుకు యూనిట్ సిద్ధపడుతోంది.