1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. I am not pregnant- Says Keneesha Francis

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Keneesha_Ravi
Keneesha_Ravi
నటుడు రవి మోహన్ ఇటీవలే తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. రాబోయే చిత్రం "బ్రోకోడ్" తో నిర్మాతగా అరంగేట్రం చేయనున్నాడు. ఈ చిత్రంలో రవి ప్రధాన పాత్రను కూడా పోషిస్తున్నాడు. కార్తీక్ యోగి దర్శకత్వం వహించిన "బ్రోకోడ్" చిత్రంలో రవి మోహన్ ప్రధాన నటుడిగా నటించగా, ప్రముఖ నటుడు ఎస్.జె. సూర్య ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. 
 
ఈ చిత్రంలో నలుగురు ప్రముఖ హీరోయిన్లు నటించనున్నారు. ఇంతలో, రవి మోహన్ స్నేహితురాలు, కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంట్ అంటూ రూమర్స్ వచ్చాయి. ఇవి నిజమేనని చాలామంది నమ్మేశారు. అయితే తాజా ఇంటర్వ్యూలో కెనీషా మాట్లాడుతూ.. తన గర్భధారణ పుకార్లను ప్రస్తావించారు. తాను, రవి మోహన్ తల్లిదండ్రులు కాబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పింది. 
 
ఇంకా మాట్లాడుతూ.. "నేను గర్భవతిని అని చాలా మంది అంటున్నారు. నేను గర్భవతిని కాదు. ఎవరైనా ఏమి చెప్పినా అది వారికి తిరిగి వస్తుంది. కర్మ ఎవరినీ ఎప్పుడూ వదిలిపెట్టదు. నిజం, అబద్ధాలు అతి త్వరలో బయటపడతాయి." అంటూ కెనీషా స్పష్టం చేసింది. 
తర్వాతి కథనం
Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది