లులియా-సల్మాన్ బ్రేకప్: భర్తతో టచ్‌లో వుండటమే కారణమా? భారత్‌లో వుండటం కష్టం బాబోయ్
బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకడైన సల్మాన్ ఖాన్‌కు పెళ్లైయ్యే దాఖలాలు కనిపించట్లేదు. సల్మాన్ ఖాన్ బ్రహ్మచారిగానే ఉండిపోతాడని బిటౌన్‌లో జోరుగా ప్రచారం సాగతోంది. ఎప్పటికప్పుడు ప్రియురాళ్లను పేరు మార్చేసే సల్లూ
బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకడైన సల్మాన్ ఖాన్‌కు పెళ్లైయ్యే దాఖలాలు కనిపించట్లేదు. సల్మాన్ ఖాన్ బ్రహ్మచారిగానే ఉండిపోతాడని బిటౌన్‌లో జోరుగా ప్రచారం సాగతోంది. ఎప్పటికప్పుడు ప్రియురాళ్లను పేరు మార్చేసే సల్లూభాయ్.. రొమేనియా మోడల్ లులియా వాంటూర్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆమెతో సల్మాన్ దూరంగా ఉన్నాడని టాక్ వస్తోంది.
పార్టీలు, సినిమా ఫంక్షన్లు, చివరకు ఇంట్లో జరిగిన కార్యక్రమాల సమయంలోనూ లులియాతో సల్మాన్ ఖాన్ కలిసి కనిపించడంతో త్వరలో వీరిద్దరూ పెళ్ళి చేసుకుంటారని కూడా వార్తలొచ్చాయి. అంతలోనే సల్మాన్-లులియా వ్యవహారానికి బ్రేక్ పడిందని తెలుస్తోంది. ఇద్దరికీ చెడిపోయిందని, వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడం లేదని సల్మాన్ సన్నిహిత వర్గాలు చెప్పాయి. అందుకు కారణాలేంటో కూడా ఎవరికీ తెలియలేదు.
ఇటీవలే లులియా తన సొంత దేశానికి వెళ్లిపోయింది కూడా. అంతేకాదు, రొమేనియాలో అత్యంత విజయవంతమైన మహిళగా ఓ అవార్డు కూడా తీసుకుంది. సల్మాన్ గురించి ఆ అవార్డు తీసుకునే సమయంలో పెదవి విప్పని లులియా.. ఆ తర్వాత ఒక రొమేనియా పత్రికకు మాత్రం అన్నీ చెప్పిందట. సల్మాన్‌తో ప్రేమ లేదని చెప్పింది. రొమేనియాలోనే తాను సురక్షితంగా ఉన్నానని చెప్పింది. తనకు ఇంతకుముందే పెళ్లైపోయిందని, భర్తకు దూరంగా ఉన్నానని తెలిపింది.
కానీ, భారతదేశంలో మాత్రం తాను ఎవరినీ పెళ్లి చేసుకోలేదు, ఎవ్వరినీ వదిలేయలేదు'' అని కూడా ఆమె కుండ బద్దలు కొట్టింది. అయితే సల్మాన్‌తో ప్రేమ వ్యవహారం గురించి మాత్రం ఏమీ చెప్పలేదు. భారతీయ సంస్కృతికి అలవాటు పడటం ఎంత కష్టమో కూడా ఆమె తెలిపింది. కానీ సల్మాన్ ఖాన్ లులియాకు దూరం కావడానికి కారణాలున్నాయని.. ఆమె భర్తతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉందని.. ఆయనతో కాంటాక్టులోనే ఉందని.. సల్మాన్‌తో పెళ్లంటే.. లులియా ఆమె భర్తకు దూరం కావాలని.. ఆ పద్ధతి నచ్చకే రొమానియాకు వెళ్ళిపోయిందని బిటౌన్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.