1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2016 (17:27 IST)

గొల్లపూడి కొట్టిన దెబ్బకు కిందపడిపోయా... నటి పూర్ణిమ

'ముద్దమందారం', 'శ్రీవారికి ప్రేమలేఖ', 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' తదితర చిత్రాల్లో నటించిన నటి పూర్ణిమ గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఈ హీరోయిన్ ఓ సినిమా షూటింగ్ సమయంలో ప్రముఖ నటుడు, రచయిత, దర్శక

'ముద్దమందారం', 'శ్రీవారికి ప్రేమలేఖ', 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' తదితర చిత్రాల్లో నటించిన నటి పూర్ణిమ గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఈ హీరోయిన్ ఓ సినిమా షూటింగ్ సమయంలో ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు గొల్లపూడి మారుతీరావు తనను కొట్టిన విషయం వాస్తవమేనని పూర్ణిమ అన్నారు. జంధ్యాల దర్శకత్వంలో 1981లో వచ్చిన ''ముద్ద మందారం'' చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైన నాటి నటి పూర్ణిమ, తన తాజా ఇంటర్వ్యూలో ఈ అనుభవాలను పంచుకుంది. 
 
1983లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ''మనిషికో చరిత్ర'' చిత్రంలో గొల్లపూడి మారుతీరావు గారికి కూతురి పాత్రలో నటించాను. మా ఇద్దరి మధ్య షూట్ చేయాల్సిన ఒక సన్నివేశం కోసం రిహార్సల్ చేశాం. రిహార్సల్ బాగానే చేశాను గానీ, తీరా చిత్రీకరణ సమయంలో మాత్రం నేను చెప్పాల్సిన డైలాగ్ మర్చిపోతున్నాను. ఈ క్రమంలో, చాలా టేక్‌లు తీసుకున్నాను. దర్శకుడికి విసుగొచ్చింది. 
 
ఆ సమయంలోనే గొల్లపూడి నా చెంపపై కొట్టడంతో, నేను కిందపడిపోయానని చెప్పింది పూర్ణిమ. అయితే ఆ తర్వాత నా ముఖంపై నీళ్లు చల్లి లేపారని... ఆ సందర్భంలో అక్కడే ఉన్న మా నాన్న గారు, ఈ విషయంపై గొల్లపూడితో గొడవకు దిగారని నాటి విషయాలను గుర్తు చేసుకుంది పూర్ణిమ. అయితే సినీ ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు సహజమేనని చెప్పారు.