మగాళ్ళపై జయలలిత ద్వేషం పెంచుకోవడానికి వారిద్దరే కారణమా?
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి దివంగత జయలలితకు మగవాళ్లు అంటే అమితమైన ద్వేషం. అందుకే ఆమె వద్దకు వెళ్లే ప్రతి ప్రజాప్రతినిధితో పాటు.. చివరకు ఐఏఎస్ అధికారి అయినా ఆమెకు వంగి దండం పెట్టాల్సింద
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి దివంగత జయలలితకు మగవాళ్లు అంటే అమితమైన ద్వేషం. అందుకే ఆమె వద్దకు వెళ్లే ప్రతి ప్రజాప్రతినిధితో పాటు.. చివరకు ఐఏఎస్ అధికారి అయినా ఆమెకు వంగి దండం పెట్టాల్సిందే. అయితే, జయలలితకు మగాళ్లు అంటే ఎందుకు అంత కోపమనే విషయంపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తాను నమ్మిన ఆ ఇద్దరు మగాళ్ళు నట్టేట ముంచడం వల్లే ఆమె ఆ విధంగా నడుచుకునేవారని చెపుతున్నారు. ఎవరా ఇద్దరనే కదా మీ సందేహం.
జయలలితకు రాజకీయ గురువు పురట్చితలైవర్ ఎంజీఆర్. రాజకీయాల్లోకి రాకముందు నుంచి జయలలితకు, ఎంజీఆర్‌లు అనేక చిత్రాల్లో నటించారు. వీరిద్దరి మంచి సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఎంజీఆర్ అన్నాడీఎంకేను స్థాపించిన తర్వాత జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి ఎంజీఆర్ చనిపోయేంత వరకు ఆయన వెంటే ఉన్నారు.
అయితే, ఎంజీఆర్‌పై ఎంతో నమ్మకం పెట్టుకున్న జయలలిత ఒకానొక కాలంలో కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన సాయం చేయలేకపోయారు. తర్వాత టాలీవుడ్ అందగాడు హీరో శోభన్ బాబు చెంతకు చేరింది. వీరిద్దరు కొంతకాలం సహజీవనం కూడా చేశారనే ప్రచారం ఉంది. కానీ ఆయన కూడా ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్పు ఇవ్వలేక పోయారు.
అప్పటి నుంచి మగాళ్లపై అనుకోకుండా ద్వేషం పెంచుకున్న జయలలిత... ఇక వాళ్లతో కఠినగా వ్యవహరించడం మొదలు పెట్టారు. మగాళ్లతో కాళ్లకు దండం పెట్టించుకోవడమే కానీ.. వారికి తనతో సమానంగా కూర్చునే స్థాయి లేదని అనుకునేవాళ్లు. రాజకీయ జీవితం ప్రారంభించిన తొలినాళ్లలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలు కూడా సొంత టేపురికార్డర్లో రికార్డ్ చేసేవారట. తన వ్యాఖ్యలు వక్రీకరిస్తారని ఆమె భయం. కానీ అదీ ఒకందుకు మంచిదే అని సీనియర్ జర్నలిస్టులు చెబుతున్నారు.