బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శుక్రవారం, 18 జూన్ 2021 (20:53 IST)

మూడు సినిమాలకే మూడు కోట్లు డిమాండ్ చేస్తున్న భామ

పూజా హెగ్డే వరుస హిట్లతో లక్కీ హీరోయిన్ అయిపోయినా ఇంతవరకూ 3కోట్లు తీసుకోలేదు. ఇక రష్మిక అయితే 2 కోట్లు తీసుకోవడం గగనమైపోతోంది. అయితే ఓ ఫ్లాప్ హీరోయిన్‌కు మూడుకోట్లు ఇస్తున్నారనట. తెలుగులో మూడు కోట్ల హీరోయిన్ చేరుకున్న హీరోయిన్ గురించే ఇప్పుడు చర్చంతా సాగుతోంది.
 
సినిమా పేరు చెప్పకపోయినా సౌత్ ఇండియా మూవీకి సైన్ చేశానని కియారా అద్వానీ సోషల్ మీడియాలో పేర్కొంది. శంకర్ - రామచరణ్ మూవీనా, కొరటాల-జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో నటిస్తుందా అనే చర్చ నడుస్తోంది.
 
అనౌన్స్ చేయకపోయినా జూనియర్ ఎన్టీఆర్‌తో జత కడుతోందట భామ. భరత్ అను నేనులో మహేష్ బాబుతో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కియారా రెండవ సినిమా వినయవిధేయరామలో చెర్రీతో జతకట్టింది. సినిమా ఫ్లాప్ కావడంతో అవకాశాలు దక్కలేదు. ఈలోగా అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ సూపర్ హిట్ కావడంతో అక్కడే వరుస ఆఫర్లతో బిజీ అయిపోయింది అమ్మడు.
 
కబీర్ సింగ్ సూపర్ హిట్ తరువాత కియారా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కరీనా, కత్రీనా మించిన క్రేజ్‌ను సంపాదించిందట. చేతి నిండా సినిమాలతో బాలీవుడ్లో బిజీ అయిపోయింది. తెలుగు ఆఫర్లు వచ్చినా డేట్స్ అడ్జెస్ట్ చేయలేక వదులుకుంది కియారా. భరత్ అను నేను హిట్ కావడంతో ఎన్టీఆర్ సినిమాకు కియారానే ఎంచుకున్నారట.
 
మూడవ సినిమా కోసం మూడు కోట్లు డిమాండ్ చేసిందట. టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన పూజా హెగ్డే కంటే ఎక్కువగా డిమాండ్ చేసినా కియారాకు ఉన్న మార్కెట్ కూడా బాగుండడంతో ఆమె అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు ఒకే అన్నారట.