ఇంటర్నెట్ ఓ గాసిప్ కాలనీ.. గాసిప్స్ వదిలి వేరేదైనా చెయ్యండయ్యా?
ఇంటర్నెట్ అనేది ప్రస్తుతం ఓ గాసిప్ కాలనీగా మారిపోతోందని హీరోయిన్, కాబోయే మెగావారింటి కోడలు లావణ్య త్రిపాఠి ఫైర్ అయ్యింది. ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ గురించి రూమర్స్ వస్తూనే వున్నాయి. ఒక పర్సన్ చూసి 3 నిమిషాల్లో జడ్జిమెంట్ ఇవ్వడం ఇకనైనా ఆపేయండి అంటూ లావణ్య త్రిపాఠి హితవు పలికింది.
సెలెబ్రిటీల గురించి సోషల్ మీడియా వేదికగా వచ్చే గాసిప్స్‌పై లావణ్య కౌంటరిచ్చింది. మనం ఒకరి గురించి నెగటివ్‌గా మాట్లాడుతున్నామంటే మన లైఫ్ కూడా అలాగే తయారవుతుందని తెలుసుకోవాలని చెప్పింది.
ఇలాంటి గాసిప్స్ సృష్టించే సమయాన్ని వారి వారి భవితవ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ఉపయోగించుకోండి అంటూ ఇన్‌స్టాలో ఘాటుగా అడ్వైజ్ చేసింది.