శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: గురువారం, 2 మే 2019 (15:45 IST)

రష్మిక అదృష్టం ఈ యువ హీరోకు కలిసొస్తుందా.. ఎవరు?

అక్కినేని అఖిల్ తొలి చిత్రంతోనే పెద్ద హీరోగా నిలబడతాడని అంతా అనుకున్నారు. కానీ వరుసగా మూడు ఫ్లాప్‌లు ఇచ్చి నిరాశపరిచాడు. దీంతో ఈ కుర్రహీరో సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు నాలుగో సినిమాకు రెడీ అవుతున్నాడు.
 
హీరో అఖిల్ మొదటి సినిమా అందరినీ నిరాశపరిచింది. ఇక రెండో సినిమాగా హలో రిలీజైంది. అది కూడా పెద్దగా సంతృప్తి ఇవ్వలేదు. ఇది కూడా నిరాశపరచడంతో పట్టుదలతో మూడో చిత్రం చేశాడు. అది కూడా డిజాస్టర్ అయ్యింది. ఇలా మొదటి సినిమా నుంచి మూడవ సినిమా వరకు గ్రాఫ్‌ పడిపోయింది. ఈ నేపధ్యంలో అఖిల్ తన నాలుగవ సినిమాను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు.
 
ఈ సినిమాతో అఖిల్ అల్లు వారి క్యాంపస్‌లో చేరిపోయారు. నాగచైతన్య, నాని, విజయ్ దేవరకొండ వంటి హీరోలకు బ్లాక్‌బస్టర్ సినిమాలు తీసిన సంస్థతో తొలి విజయం అందుకోవాలని అఖిల్ ఉవ్విళ్ళూరుతున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ అఖిల్ నాలుగవ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. అఖిల్ నాలుగవ చిత్రం వచ్చే నెలలో ప్రారంభం కానుంది. 
 
ఈ చిత్రంలో హీరోయిన్‌గా గీతగోవిందం హీరోయిన్ రష్మిక నటించబోతోంది. సంగీత దర్శకుడిగా గోపి సుందర్ ఫిక్సయ్యాడు. సినిమా షూటింగ్‌కు అంతా సెట్టయ్యింది. అయితే రష్మికకు ఉన్న అదృష్టం తనకు బాగా కలిసొస్తుందని, ఖచ్చితంగా నాలుగవ సినిమా బ్లాక్‌బస్టర్ సినిమా అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు అఖిల్. ఏమవుతుందో చూడాలి మరి.