సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 మే 2020 (18:04 IST)

కుర్ర హీరోలతో పవర్ స్టార్ : మల్టీస్టారర్ మూవీకి ప్లాన్?

తెలుగు చిత్రపరిశ్రమలో ఇపుడు మల్టీస్టారర్ మూవీలకు తెరలేసిందని చెప్పొచ్చు. గతంలో వెంకటేష్ - పవన్ కళ్యాణ్ నటించిన గోపాల గోపాల్ చిత్రంతో ఈ ట్రెడ్ పీక్‌స్టేజ్‌కి చేరింది. ఆ తర్వాత అనేక చిత్రాలు వచ్చాయి. అక్కినేని నాగార్జున - నాని, వెంకటేష్ - అక్కినేని నాగ చైతన్య, బాలకృష్ణ - మంచు విష్ణు, వెంకటేష్ - నితిన్, మహేష్ బాబు - అల్లరి నరేష్, అల్లు అర్జున్ - సుశాంత్ వంటి హీరోలు నటించిన చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం రాం చరణ్ - జూనియర్ ఎన్టీఆర్‌లు నటించే మల్టీస్టారర్ మూవీ సెట్స్‌పై ఉంది. 
 
ఈ నేపథ్యంలో భారీ బ‌డ్జెట్‌తో మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు తెర‌కెక్కించేందుకు నిర్మాత‌లు ఏ మాత్రం వెనుకాడడం లేదు. ఇప్ప‌టికే ఆర్ఆర్ఆర్ వంటి బ‌డా ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో తెర‌కెక్కుతుండ‌గా, త్వ‌ర‌లో మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ రూపొంద‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇందుకోసం నాని, నాగ చైత‌న్య‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌లిసి ప‌ని చేయ‌నున్నారు.
 
నాగ చైత‌న్య ప్ర‌ధాన పాత్ర‌లో సంతోషం ద‌ర్శ‌కుడు ద‌శ‌ర‌థ్ తెర‌కెక్కించ‌నున్న చిత్రాన్ని నాని, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌‌లు నటించనున్నారట. అలాగే, నాని, పవన్ కళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ క‌లిసి నిర్మించ‌నున్నార‌ట‌. నాని, ప‌వ‌న్‌కి ప్ర‌త్యేక బేన‌ర్స్ ఉండ‌గా త్రివిక్ర‌మ్‌కి హారిక్ అండ్ హాసిని క్రియేష‌న్స్ ఫండ్ స‌మ‌కూర్చ‌నుంద‌ట‌. 
 
ఈ ముగ్గురు క‌లిసి చైతూతో చిత్రం చేయ‌నున్న‌ట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. నాగ చైత‌న్య ప్ర‌స్తుతం ల‌వ్ స్టోరీ అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సివుంది.