సంబంధిత వార్తలు
- నయనతార దెబ్బతో గుడ్లు తేలేసిన ప్రొడ్యూసర్, ఏమైంది? (video)
- శ్రీరెడ్డిని చంపేస్తామంటూ స్టాలిన్ ఫ్యాన్స్ వార్నింగ్, రాజకీయాల్లోకి వస్తున్నానంటున్న శ్రీరెడ్డి
- పింక్ తెలుగు రీమేక్.. పవర్ స్టార్, నయనతార కలిసి నటిస్తారా? (video)
- మీ మీద గౌరవం ఉంది.. పద్దతిగా మాట్లాడండి.. అంబటికి పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- చెర్రీ... నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఇప్పటికైనా అది కాస్త పెంచు: జక్కన్న సీరియస్ వార్నింగ్?
ఈసారి అలా చేస్తే ఊరుకోనంటూ డైరెక్టర్‌కి నయనతార వార్నింగ్
నయనతార.. ఆమె అభిమానులు ముద్దుగా నయన్ అని పిలుస్తారు. ఒకప్పుడు ముద్దుగా బొద్దుగా ఉన్న ఈ భామ ఇప్పుడు స్లిమ్‌గా తయారై అభిమానుల మనస్సుల్లో పదిలమైన స్థానాన్ని సంపాదించుకుంటోంది. నయనతార అభిమానులు ఆమె నటించిన కొత్త సినిమాలు ఎప్పుడు వస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
అయితే ఈమధ్య నయనతార కాస్త డిప్రెషన్లో ఉందట. ఏకంగా డైరెక్టర్లకే వార్నింగులు కూడా ఇచ్చేస్తోందట. మామూలుగా డైరెక్టర్లు నటీనటులకు వార్నింగ్ ఇస్తుంటారు. కానీ కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయన రూటే వేరు కదా.. అందుకే డైరెక్టర్‌కే వార్నింగ్ ఇచ్చింది.
తాజాగా నయనతార సూపర్ స్టార్ రజినీకాంత్ పక్కన నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు మురుగదాస్ దర్సకత్వం వహిస్తున్నారు. గతంలో ఈయన దర్సకత్వంలో నయనతార గజినీ సినిమా చేసింది. ఆ సినిమాలో తన పాత్రను బాగా తగ్గించారని.. చెప్పిందొకటి తీసింది మరొకటి అంటూ అప్పట్లో మురుగదాస్‌తో గొడవపడింది ఈ భామ.
ఈ సినిమాలో తన పాత్ర తగ్గిస్తే ఊరుకునేది లేదని.. అవసరమైతే సినిమాను అడ్డుకుంటానని మురుగుదాస్‌కు గట్టిగా వార్నింగ్ ఇచ్చిందట నయనతార. ప్రస్తుతం నయనతార కోలీవుడ్లో స్టార్ హీరోయిన్. ఆమె చెప్పింది వినాలే తప్ప మరొక ఆప్షన్ లేదట. కాబట్టి మురుగదాస్ కూడా మౌనంగా ఉండిపోయారని సినీ యూనిట్ చెవులు కొరికేసుకుంటున్నారు.
