సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 18 నవంబరు 2019 (16:08 IST)

శ్రీరెడ్డిని చంపేస్తామంటూ స్టాలిన్ ఫ్యాన్స్ వార్నింగ్, రాజకీయాల్లోకి వస్తున్నానంటున్న శ్రీరెడ్డి

ఇటీవల శ్రీరెడ్డి పేరుతో స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ పైన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అతడితో ఓ రాత్రి గడిపానంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించినట్లుగా వున్నది ఆ పోస్ట్. దీనితో అది కాస్తా సంచలనం సృష్టించింది. ఉదయనిధి స్టాలిన్ అభిమానులు ఈ పోస్టుపై మండిపడ్డారు. శ్రీ రెడ్డి చెన్నైలో కనిపిస్తే చంపేస్తామంటూ వరస పోస్టులు పెట్టడంతో శ్రీరెడ్డి లైన్లోకి వచ్చింది. 
 
చెన్నైలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో శ్రీరెడ్డి మాట్లాడుతూ తాను అసలు ఉదయనిధిని ఇప్పటివరకు నేరుగా కూడా చూడలేదని, తన పేరుతో అనేక నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు ఉన్నాయనీ, వాటిలో ఒక ఖాతా నుంచి ఈ పోస్టు విడుదలైందని చెప్పింది. ఈ అంశంపై ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని చెప్పింది. 
 
ఎవరో కావాలనే ఇటువంటి వదంతులు సృష్టిస్తున్నారంటూ మండిపడింది. త్వరలో రాజకీయాల్లోకి వ‌స్తాన‌ని శ్రీరెడ్డి తెలిపింది. తమిళనాడులో ఒక ప్రముఖ పార్టీలో చేరబోతున్నానని, అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెల్లడిస్తానని చెప్పింది.