నయనతారకు హోటల్‌లో గది ఇవ్వాలా...? మా వల్ల కాదు బాబోయ్... స్టార్ హోటల్స్... ఎందుకలా...?
అంతేమరి. ఏదేని ఇండస్ట్రీలో అనుకోకుండా ఉన్నత శిఖరాలను అందుకుంటే కొంతమందికి నెత్తిన పొగరు ఎక్కుతుందని చెపుతుంటారు. అలాంటిదే నయనతార విషయంలోనూ కాస్త కనబడుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ బ్లాక్ బ్యూటీ కనుక స్టార్ హోటల్‌లో బస చేసినప్పుడు పొరబాటున ఆమెకు
అంతేమరి. ఏదేని ఇండస్ట్రీలో అనుకోకుండా ఉన్నత శిఖరాలను అందుకుంటే కొంతమందికి నెత్తిన పొగరు ఎక్కుతుందని చెపుతుంటారు. అలాంటిదే నయనతార విషయంలోనూ కాస్త కనబడుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ బ్లాక్ బ్యూటీ కనుక స్టార్ హోటల్‌లో బస చేసినప్పుడు పొరబాటున ఆమెకు కోపం వచ్చిందో...? అంతేసంగతులట. ఎదురుగా ఎవరున్నారని కూడా చూడకుండా తనకు అసౌకర్యం కల్గించిన వారిని చెడామడా తిట్టిపోస్తుందట. అప్పటికీ కోపం చల్లారకపోతే ఎదురుగా ఉన్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేస్తుందట.
మేడమ్‌కు కోపం వచ్చే పని ఏం చేశారయ్యా బాబూ అంటూ మేనేజర్ పరుగులు పెట్టాల్సిందేనంట. అంతెందుకు... ఆమె హోటల్‌లో బస చేసి ఉన్నదంటే ఆమె గదికి కాస్త అటుఇటూగా మేనేజర్లు చాలా అప్రమత్తంగా ఉంటుంటారట. ఆమె టార్చర్ చాలా స్టార్ హోటల్ సిబ్బందిలో చాలామంది రుచి చూశారట కూడా. అందువల్ల ఆమెకు స్టార్ హోటల్లో రూమ్ ఇవ్వాలంటే వణికిపోతున్నారట.
ఇటీవలే విక్టరీ వెంకటేష్ సరసన నటించిన బాబు బంగారం చిత్రం షూటింగ్ సమయంలోనూ నయనతార తన ప్రతాపాన్ని చూపిందట. దాంతో చిత్ర బృందం ఇక చాలు బాబోయ్ అంటూ ఆమెతో ఓ పాట షూటింగ్ చేయాల్సి ఉన్నా తట్టాబుట్టా సర్దేసుకున్నారట. దీనికితోడు బంజారాహిల్స్‌లో ఓ హోటల్‌లో నయనతార బస చేసి, ఆ సమయంలో ఆమెకు ఏదో విషయంపై ఆగ్రహం రావడంతో గదిలో ఫర్నీచర్ అంతా తుక్కుతుక్కు చేసిందట. దానితో హోటల్ సిబ్బంది వణికిపోయారట.
ఐతే ఆ తర్వాత ఫర్నీచర్ ఎంతమేరకు దెబ్బతిన్నదో దానికి సంబంధించిన నష్టపరిహారం చెల్లించి వచ్చిందట కానీ... ఆమె ప్రతాపం చూపించే సమయంలో మాత్రం ఆమె ముందు ఎవ్వరూ నిలబడలేరట మరి. నయనతార ఎందుకిలా చేస్తుందో మరి... లవ్ దెబ్బేమో అని కొందరు అనుకుంటున్నారు.