సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : మంగళవారం, 20 డిశెంబరు 2016 (10:54 IST)

పవన్ కళ్యాణ్ చిత్రంలో నటించేందుకు నిరాకరించిన మలయాళ బ్యూటీ!

హీరో పవన్ కళ్యాణ్ చిత్రంలో నటించే అవకాశం కోసం పలువురు హీరోయిన్లు పోటీపడుతుంటారు. ఇందుకోసం ఎపుడెపుడు ఆ ఛాన్స్ వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఒక వేళ అవకాశం వస్తే మాత్రం ఆ అవకాశాన్ని వదులుకోరు.

హీరో పవన్ కళ్యాణ్ చిత్రంలో నటించే అవకాశం కోసం పలువురు హీరోయిన్లు పోటీపడుతుంటారు. ఇందుకోసం ఎపుడెపుడు ఆ ఛాన్స్ వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఒక వేళ అవకాశం వస్తే మాత్రం ఆ అవకాశాన్ని వదులుకోరు. కానీ, ఓ మలయాళ బ్యూటీ మాత్రం పవన్ చిత్రంలో నటించేందుకు నో చెప్పింది. ఆమె ఎవరో కాదు... నివేదా థామస్. 
 
హీరో నాని నటించిన 'జెంటిల్‌మెన్' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, తొలి మూవీతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. అయితే తమిళంలో హిట్ మూవీ 'వేదాళం'ను తెలుగులో పవన్ కల్యాణ్ రీమేక్ చేయడానికి సన్నద్ధమయ్యాడు. పవన్ సరసన కీర్తి సురేష్, శృతిహసన్ పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
 
తమిళ రీమేక్ మూవీలో పవన్ చెల్లిలి క్యారెక్టర్లో నివేదా థామస్ కనిపించనుందని వదంతులు వచ్చాయి. ఈ విషయంపై నివేదా థామస్ స్పందించారని.. స్టార్ హీరో సరసన హీరోయిన్‌గా జతకట్టేందుకు ఎవరైనా ఇష్టపడతారని, చెల్లిలి పాత్ర చేసేందుకు నాకు ఇష్టం లేదు అని తెగేసి చెప్పింది. మరోవైపు పవన్ 'కాటమరాయుడు' మూవీ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. 'కాటమరాయుడు' తర్వాతే వేదలం రీమేక్ పై పవన్ దృష్టి సారించనున్నాడు.