గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: మంగళవారం, 18 జులై 2017 (17:31 IST)

డ్రగ్స్ కేసు... పూరీ వణికిపోతున్నారా? గట్టి లాయర్స్ కోసం సినీ సెలబ్రిటీలు

డ్రగ్స్ కేసులో సినీ ఇండస్ట్రీకి చెందిన మొదటి వ్యక్తిని రేపు సిట్ విచారించబోతోంది. ఆ మొదటి వ్యక్తి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్. పోకిరి చిత్రంలో మాఫియాలు.. మత్తుమందులు చూపించిన పూరీ జగన్నాథ్ ఆయనే మత్తుమందు కేసులో బుక్కవడం చర్చనీయాంశంగా మారిం

డ్రగ్స్ కేసులో సినీ ఇండస్ట్రీకి చెందిన మొదటి వ్యక్తిని రేపు సిట్ విచారించబోతోంది. ఆ మొదటి వ్యక్తి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్. పోకిరి చిత్రంలో మాఫియాలు.. మత్తుమందులు చూపించిన పూరీ జగన్నాథ్ ఆయనే మత్తుమందు కేసులో బుక్కవడం చర్చనీయాంశంగా మారింది. పూరీతో పాటు ఈ కేసులో నోటీసులు అందుకున్నవారు కూడా వరుసగా సిట్ ముందు హాజరవక తప్పని పరిస్థితి.
 
కాగా సిట్ విచారణ ఎలా వుంటుందో... ఎలాంటి ప్రశ్నలు వేస్తారో... ఒకవేళ స్లిప్పయితే వ్యవహారం అరెస్టు దాకా వెళుతుందేమోనని సినీ సెలబ్రిటీలు బిక్కచచ్చిపోతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. అందుకే కేసులో గట్టిగా వాదించడానికి మంచి న్యాయవాదులను వెదుక్కునే పనిలో పడినట్లు సమాచారం.
 
ఇంకోవైపు ముమైత్ ఖాన్ బిగ్ బాస్ షోలో పాల్గొనడంతో ఆమెకు నోటీసులు అందలేదు. అందుకే ఆమెను మాత్రం విచారణ ఎప్పుడు చేస్తామనేది తర్వాత చెపుతామని ఎక్సైజ్ అధికారులు చెపుతున్నారు. మొత్తమ్మీద డ్రగ్స్ కేసుతో టాలీవుడ్ ఇండస్ట్రీ వణికిపోతోంది.