ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : శనివారం, 3 సెప్టెంబరు 2016 (11:06 IST)

మజ్నుకు సూపర్ రెస్పాన్స్.. క్లైమాక్స్‌లో రాజ్ తరుణ్ రోలే సినిమాకు హైలైట్

వరుస హిట్స్ తో మంచి ఊపుమీదున్న హీరో నాని. జెంటిల్మన్ చిత్రం తరువాత నాని నటిస్తున్న చిత్రం మజ్ను. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నా

వరుస హిట్స్ తో మంచి ఊపుమీదున్న హీరో నాని. జెంటిల్మన్ చిత్రం తరువాత నాని నటిస్తున్న చిత్రం మజ్ను. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త వెలువడింది. అదేంటంటే...నాని-రాజ్ తరుణ్‌ల గురించి ఓ వార్త. వీళ్లిద్దరి మధ్య విభేదాలు మొదలైనట్టు సమాచారం. 
 
ఇదంతా రియల్ లైఫ్ కాదండోయ్.. రీల్ లైఫ్! నాని హీరోగా రానున్న ఈ రొమాంటిక్ కామెడీలో రాజ్‌తరుణ్ గెస్ట్‌ రోల్ పోషిస్తున్నాడు. దాదాపు 3 నుంచి 5 నిమిషాల సీన్‌లో దర్శనమిస్తాడనట. ఇది సినిమాకే హైలైట్‌ అని యూనిట్ వర్గాలు అంటున్నాయి. ప్రియురాలి కోసం ఇద్దరు పోటీపడిన సన్నివేశాల్ని కళ్లకు కట్టినట్టు తెరకెక్కించాడట డైరెక్టర్ వర్మ. ఎందుకంటే ఈ సినిమా డైరెక్టర్ విరించి వర్మ గతంలో రాజ్ తరుణ్‌తో ఉయ్యాలా జంపాలా చేశాడు కాబట్టి.
 
అయితే ముందుగా ఈ పాత్రను వేరే వారితో చేయించాలనుకున్నారట. కానీ ఫ్రెండ్ అడిగేసరికి రాజ్ తరుణ్ కాదనలేకే ఈ పాత్ర చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేస్తుండగా ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ న్యూస్ సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తోంది. క్లైమాక్స్లో వచ్చే రాజ్ తరుణ్ పాత్ర సినిమాకే హైలెట్ అంటున్నారు చిత్రయూనిట్. మొత్తానికి ఈ ఇద్దరు హీరోలు నటిస్తున్న ఈ చిత్రం ఎంతటి విజయం సాధిస్తుందో చూడాలి.