సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2024 (10:01 IST)

మహేష్ బాబు, రామజమౌళి సినిమా కథ లీక్ చేసిన రచయిత ?

maheshbabu
maheshbabu
తెలుగు సినిమాలకు కథలు దొరక్క విదేశీ సినిమాల సీడీలు చూసి మార్చి వెండితెర ఎక్కిస్తున్నారనే నానుడి వుంది. ఇక విదేశీయులయితే అవతార్ వంటి కథలను మన పురాణాల్లోంచి తీసుకుని బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. ఇక దర్శకుల్లో ప్రత్యేకమైన రాజమౌళి కూడా అంతే. తాజాగా మహేష్ బాబుతో తీస్తున్న సినిమా కథ కూడా రచయిత విజయేంద్ర ప్రసాద్ లీక్ చేసేశాడు. 
 
ఈ కథ ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా  సాగుతుందని సమాచారం.  ఇటీవలే విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ కు పెద్ద అభిమానులం. అందుకే, ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాయాలనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాకు మాటలు రాసే బాధ్యతను మరో రచయితకు అప్పగించారు. ఆయనే సాయిమాధవ్ బుర్రా. ఇప్పటికే రెండు వర్షన్ లు రాశాడట. త్వరలో ఫైనల్ వర్షన్ అయ్యాక సెట్ పైకి ఎప్పుడు వెలుతుందో వివరాలు తెలియజేయనున్నారని సమాచారం.