గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : సోమవారం, 15 మే 2017 (11:09 IST)

డేటింగ్ అంటూ చేస్తే ఖచ్చితంగా ఆ హీరోతోనే... జిమ్ వ్యాపారం బాగానే ఉందంటున్న హీరోయిన్!

టాలీవుడ్‌కు చెందిన హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ అమ్మడికి భారతీయ వివాహ వ్యవస్థపై ఎంతో నమ్మకం ఉందట. దీనిపై ఆమె స్పందిస్తూ... పెద్దలు కుదిర్చిన పెళ్లిలోనే ఆనందం ఎక్కువగా ఉందని తెలిపింది.

టాలీవుడ్‌కు చెందిన హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ అమ్మడికి భారతీయ వివాహ వ్యవస్థపై ఎంతో నమ్మకం ఉందట. దీనిపై ఆమె స్పందిస్తూ... పెద్దలు కుదిర్చిన పెళ్లిలోనే ఆనందం ఎక్కువగా ఉందని తెలిపింది. ఇప్పటికిప్పుడే తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని... పెళ్లికి ఇంకా చాలా టైమ్ ఉందని చెప్పింది. తనకు నచ్చిన వాడు ఇంకా కంటపడలేదని... సరైనవాడి కోసం ఎదురు చూస్తున్నానని తెలిపింది.
 
తాను ఎవరితోనూ ప్రేమలో పడలేదని... ఒక వేళ డేటింగ్ చేయాల్సి వస్తే బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్‌తో చేస్తానని బోల్డ్‌గా చెప్పింది. తాను ప్రారంభించిన జిమ్ వ్యాపారం బాగానే ఉందని... రానున్న రోజుల్లో మరో రెండు బ్రాంచ్‌లు ప్రారంభిస్తామని తెలిపింది. తన కుటుంబసభ్యులే ఆ వ్యాపారాన్ని చూసుకుంటున్నారని చెప్పింది. కాగా, రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల జిమ్‌ను కూడా ప్రారంభించిన విషయం తెల్సిందే. ఈ జిమ్ వ్యాపారం బాగానే ఉందని చెప్పుకొచ్చింది.