1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Rs 1 lakh wig for Kangana Ranuat

కంగనా విగ్గు ఖరీదు లక్షరూపాయలా..? హృతిక్‌తో జగడానికి దిగినా క్రేజ్ తగ్గలేదు.. ఎందుకని?

బాలీవుడ్‌ నటి కంగనా.. హృతిక్‌తో వివాదంలో చిక్కుకున్నప్పటికీ అవకాశాలు మాత్రం వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం సైఫ్‌, షాహిద్‌లతో కలిసి కంగనా.. రంగూన్‌ చిత్రంలో నటిస్తూ బిజి బిజీగా ఉంది. విశాల్‌ భరద్వా

Rs 1 lakh
బాలీవుడ్‌ నటి కంగనా.. హృతిక్‌తో వివాదంలో చిక్కుకున్నప్పటికీ అవకాశాలు మాత్రం వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం సైఫ్‌, షాహిద్‌లతో కలిసి కంగనా.. రంగూన్‌ చిత్రంలో నటిస్తూ బిజి బిజీగా ఉంది. విశాల్‌ భరద్వాజ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వరుస హిట్లతో దూసుకుపోతున్న కంగనా.. బాలీవుడ్‌లో హాట్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. 
 
తాజాగా కంగనా ఓ హెయిర్‌ కేర్‌ బ్రాండ్‌ని ఎండార్స్‌ చేయబోతోంది. ఇందులో కంగనా విగ్గు పెట్టుకుని కనిపించాల్సి ఉంటుందట. దీనికోసం ఖరీదైన విగ్గుని నిర్మాణ బృందం విదేశాల నుంచి తెప్పించిందట. ఇంతకీ ఆ విగ్గు ఖరీదు ఎంతో తెలుసా... అక్షరాల రూ.1 లక్ష. దీంతో కంగనాకు ఉన్న క్రేజ్ చూసి బాలీవుడ్ జనాలు అక్కసు వెళ్లగక్కుకుంటున్నారట. అంతేకాదు.. హృతిక్ రోషన్‌లాంటి టాప్ హీరోతో జగడానికి దిగినా అమ్మడు క్రేజ్‌కు ఏమాత్రం ఢోకా లేదని.. నటనాపరంగా ఛాలెంజింగ్ రోల్స్ ఎంచుకుని దూసుకెళ్లడమే ఇందుకు కారణమని సినీ పండితులు అంటున్నారు. 
About Writer
chitra
తర్వాతి కథనం
కొత్త పనిమనిషి వచ్చిన హుషారులో..?!