గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2017 (14:04 IST)

బాలీవుడ్ భామను... అక్కడఇక్కడా తిప్పుతారు.. అంతా చూపించమంటారు? ఆ మాత్రం ఇవ్వలేరా?

ఆ లొకేషన్.. ఈ లొకేషన్.. ఆవూరు.. ఈవూరు అంటూ నెలలకాలాల పాటు తిప్పుతారు. అలాంటపుడు.. నేను అడిగనంత రెమ్యునరేషన్ ఇవ్వలేరా? అంటూ బాలీవుడ్ నటి పరణీతి చోప్రా నిర్మొహమాటంగా అడిగిందట. దీంతో నిర్మాతతో పాటు.. దర్శ

ఆ లొకేషన్.. ఈ లొకేషన్.. ఆవూరు.. ఈవూరు అంటూ నెలలకాలాల పాటు తిప్పుతారు. అలాంటపుడు.. నేను అడిగనంత రెమ్యునరేషన్ ఇవ్వలేరా? అంటూ బాలీవుడ్ నటి పరణీతి చోప్రా నిర్మొహమాటంగా అడిగిందట. దీంతో నిర్మాతతో పాటు.. దర్శకుడు హడలిపోయారట. 
 
'శ్రీమంతుడు' తర్వాత మరోసారి సూపర్ స్టార్ మహేష్ - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుంది. "భరత్ అనే నేను" టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా మే నెలలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రం హీరోయిన్ కోసం గాలించగా బాలీవుడ్ భామపై కొరటాల శివ దృష్టిపడింది. 
 
బాలీవుడ్‌లో హాట్ ఇమేజ్ ఉన్న భామల్లో ఈమె ఒకరు. కానీ, అవకాశాలు లేక ఖాళీగా ఉంది. అయినప్పటికీ... టాలీవుడ్ ఆఫర్ అనగానే.. రెమ్యునరేషన్ నోటికొచ్చినంత అడిగేసిందట. మహేష్ చిత్రంలో నటించాలంటూ ఏకంగా రూ.3 కోట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిందట. 
 
ప్రస్తుతం పరిణీతి అంత ఫాంలో కూడా లేదు. అందుకే ఆమెకు అంత ఇవ్వడందేనికి అని సింపుల్‌గా ఎంఎస్.ధోనీ చిత్రంలో యూత్‌ను బాగా అట్రాక్ట్ చేసిన కియరా అద్వానీని ఎంపిక చేశారట. ఈమెకు రూ.50 లక్షలే ఇస్తున్నారట. మరి వచ్చిన అవకాశం అది కూడా మహేష్ కొరటాల శివ లాంటి క్రేజీ కాంబినేషన్‌ను కియరా వదులుకుంటుందా?