పెళ్లికాని 48 ఏళ్ల హీరోయిన్... ఇప్పుడు గాలి మళ్లిందట... అతడ్ని వదిలేసుకుందా...?
నిన్నే పెళ్లాడుతా చిత్రంలో నటించిన హీరోయిన్ టబును చూసి అచ్చం అలాంటి అమ్మాయి భార్యగా వస్తే ఎంత బావుంటుందో అని అప్పట్లో కుర్రాళ్లంతా అనుకునేవారు. ఆ చిత్రంలో నాగార్జునతో చేసే రొమాన్స్ ఆ లెవల్లో ఉంటుంది మరి. ఇపుడామెకు 48 ఏళ్లు వచ్చేశాయి. ఇక పెళ్లేం చేస్కుంటుందిలే అనుకున్నారంతా. ఐతే ఆమెకిప్పుడు పెళ్లి మీద గాలి మళ్లిందట.
హిందీ దృశ్యం చిత్రంలో నటించిన టబు లేటు వయసులోనైనా ఓ తోడు కావాలనుకుంటోందట. అప్పట్లో ఓ టాలీవుడ్ హీరోతో సన్నిహితంగా ఉన్నట్లు గుసగుసలు విన్పించాయి. ఆమె కోసమే సదరు టాలీవుడ్ మంచి భవనం కూడా ఒకటి హైదరాబాదులో గిఫ్టుగా ఇచ్చాడనే గుసగుసలు సైతం విన్పించాయి.
మొత్తమ్మీద పెళ్లంటే పెళ్లే కనుక ఎవర్నో ఒకర్ని... అలా అని ఆవారాగాడ్ని కాదులెండి.... మంచి వ్యాపారవేత్తతో పెళ్లి కానించేసుకోవాలని టబు ఎదురుచూస్తోందట. మరి అలాంటి వ్యాపారవేత్త దొరకాలి కదా...