శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (11:52 IST)

దిశా పటానీ టైగర్ ష్రాఫ్‌ మాయలో పడిపోయింది.. విచ్చలవిడిగా షికార్లే షికార్లు..

దర్శకుడు పూరీ జగన్నాథ్ వరుణ్ తేజ్ కాంబోలో వెలువడిన చిత్రం ''లోఫర్''. ఈ సినిమాలో మెరిసిన హీరోయిన్ దిశాపటానీ. మోడలింగ్ చేస్తూ సినిమాల్లోకి వచ్చిన ఆమె గ్లామర్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమా డిజాస్టర్

దర్శకుడు పూరీ జగన్నాథ్ వరుణ్ తేజ్ కాంబోలో వెలువడిన చిత్రం ''లోఫర్''. ఈ సినిమాలో మెరిసిన హీరోయిన్ దిశాపటానీ. మోడలింగ్ చేస్తూ సినిమాల్లోకి వచ్చిన ఆమె గ్లామర్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమా డిజాస్టర్‌గా నిలిచిపోయినా దిశాకు బాలీవుడ్‌లో అవకాశాలకు ఏ మాత్రం కొదువలేదు. అదృష్టం కలిసొచ్చింది. టీమిండియా క్రికెటర్, కెప్టెన్ ధోనీ బయోపిక్‌లో హీరోయిన్‌గా ఎంపికైన ఈ ముద్దుగుమ్మ.. ఎక్కువ మోతాదులోనే అందాలను ఆరబోసింది. 
 
ఈ క్రమంలో దిశా పటానీ ప్రేమాయణం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. జాకీష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్‌తో దిశాపటానీ డేటింగ్ చేస్తుందని వార్తలొస్తున్నాయి. వీరిద్దరి మధ్య అనుబంధం చాలావరకు వెళ్ళిందని గుసగుసలు కూడా వినిపిస్తున్నారు. మాకేమీ తెలియదన్నట్లుగా టైగర్ ష్రాఫ్, దిశా అంటున్నారు. ఇలాంటి తరుణంలో దిశా పటానీ- టైగర్‌ అడ్డంగా దొరికిపోయారు.
 
ఇటీవల ఓ ఫామ్ హౌస్‌లో గడిపిన ఈ ఇద్దరు విడివిడిగా ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విడివిడిగా పోస్టులు పెట్టినా.. ఫొటోలను పరిశీలించిన నెటిజన్లు మాత్రం వీరిద్దరూ ఫామ్ హౌస్‌లో మస్తు మజా చేసుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు. కాగా హాలీవుడ్‌ యాక్షన్‌ హీరోల్లో ముందు వరసలో నిలబడే నటుడు జాకీ చాన్‌. మార్షల్‌ ఆర్ట్స్‌ విద్యతో సినిమాల్లో ఆయన చేసే యాక్షన్‌ అభిమానుల్ని ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'కుంగ్‌ ఫూ యోగా' సినిమాలో జాకీచాన్‌ నటిస్తున్నారు. ఇందులో భారతీయ నటులు సోనూసూద్‌.. దిశా పటానీ కూడా నటిస్తున్నారు.