శనివారం, 16 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (14:11 IST)

ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా "పెళ్లి చూపులు"

తాజాగా వెల్లడించిన 64వ జాతీయ చలన చిత్ర అవార్డుల జాబితాలో "పెళ్లి చూపులు" చిత్రం జాతీయ అవార్డును సొంతం చేసుకొని సరికొత్త రికార్డు సృష్టించింది. 2016లో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన విషయం

తాజాగా వెల్లడించిన 64వ జాతీయ చలన చిత్ర అవార్డుల జాబితాలో "పెళ్లి చూపులు" చిత్రం జాతీయ అవార్డును సొంతం చేసుకొని సరికొత్త రికార్డు సృష్టించింది. 2016లో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన విషయం తెల్సిందే. విజయ్‌ దేవరకొండ, రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వం వహించారు.
 
ఇందులో సంభాషణలకుగానూ తరుణ్‌ భాస్కర్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ తెలుగు చిత్రానికి గాను అవార్డు సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారేజ్‌’ చిత్రంలో డాన్సులకుగాను రాజు సుందరంను ఉత్తమ నృత్య దర్శకుడిగా జ్యూరీ ఎంపిక చేసింది. ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శతమానం భవతి’ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డుకు ఎంపికయ్యింది.