శనివారం, 26 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 జూన్ 2016 (16:24 IST)

అ.. ఆ.. బాక్సాఫీస్ కలెక్షన్స్.. తొలి రోజే రూ.6కోట్లు వసూళ్ళు సాధించిందట!!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, లవర్ బాయ్ నితిన్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ''అ.. ఆ..''. ఈ చిత్రంలో నితిన్ సరసన కుందనపు బొమ్మ సమంత నటించింది. ఈ సినిమా జూన్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన మొదటి రోజే భారీ వసూళ్లను సాధించి ముందుకు దూసుకెళుతుంది.

తెలుగు రాష్ట్రాల్లోనూ అలాగే ఓవర్సీస్ కలిపి రూ.6 కోట్లకు పైగా వసూళ్ళని సాధించిందట. అంతేకాకుండా నితిన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన చిత్రంగా ''అ.. ఆ..'' నిలిచింది. ఓవర్సీస్‌లో కేవలం ప్రీమియర్ షోలతోనే ఒక కోటి అరవై తొమ్మిది లక్షలను వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఏరియా పరంగా వసూళ్లను చూస్తే...
 
సీడెడ్ - 75 లక్షలు 
వెస్ట్ -  50 లక్షలు 
గుంటూరు - 47 లక్షలు 
ఈస్ట్ -   56 లక్షలు
కృష్ణా - 40 లక్షలు  
నైజాం -  2. 30 కోట్లు
నెల్లూరు - 20 లక్షలు.