మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (15:45 IST)

నవీన్ పోలిశెట్టి హీరోగా భారీ సినిమా

Naveen Polisetti
ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ, తన సక్సెస్ గ్రాఫ్ ను పెంచుకుంటూ సినిమా రంగంలో ఎదుగుతున్న సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్'. ఈ సంస్థ ఇప్పుడు మరో నూతన చిత్ర నిర్మాణ సంస్థ తో కలసి మరింత వినోదాన్ని పుష్కలంగా అందించటానికి సిద్ధమవుతోంది. ఆ నూతన చిత్ర నిర్మాణ సంస్థ పేరు "ఫార్చ్యూన్ 4 సినిమాస్". ఈ సంస్థ కిది తొలి చిత్రం కాగా  సితార ఎంటర్ టైన్మెంట్స్ కి 15 వ చిత్రం. తెలుగు సినిమా శ్రీకారం చుట్టుకున్న రోజు అయిన (1931,సెప్టెంబర్ 15) ఈరోజు నే ఈ "ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థ పురుడు పోసుకోవడం విశేషం. 
 
నవీన్ పోలిశెట్టి, ఈ తరం వినోదానికి నిఖార్సైన చిరునామా. ఆయన కథానాయకుడు గా 'సితార ఎంటర్ టైన్మెంట్స్', 'ఫార్చ్యూన్ 4 సినిమాస్'  సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న తొలిచిత్రాన్ని బుధ‌వారం అధికారికంగా ప్రకటించాయి. దీనికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేశారు. ప్రతిభగల యువకుడు కళ్యాణ్ శంకర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
 
ప్రేక్షకులుగా మీరు మరింత సరదాగా నవ్వుకోవడానికి సమాయుత్త మవ్వండి, మేము వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాము అంటూ ప్రకటించారు. వినోదం పరమావధిగా నవీన్ పోలిశెట్టి సరికొత్త అవతారం ఈ చిత్రం స్వంతం. కథానాయకుడు గా ఆయనకిది మూడవ చిత్రం. చిత్ర పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రానికి సంభందించిన మరిన్ని వివరాలను, విశేషాలను మరో సందర్భంలో మీడియాకు ప్రకటించనున్నట్లు 'సితార ఎంటర్ టైన్మెంట్స్', 'ఫార్చ్యూన్ 4 సినిమాస్' సంస్థల నిర్మాతలు సూర్య దేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్య లు తెలిపారు.