P Venkateswara rao తేనెమనసులు, కన్నెమనసులు, ఆత్మీయులు, మరోప్రపంచం, సుడిగుండాలు, ముత్యాలముగ్గువంటి అనేక సినిమాల్లో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన నటుడు పి. వెంకటేశ్వర రావు మృతి చెందారు. మొదటి చిత్రం తేనెమనసులులో హాస్యనటుడిగా చిత్రరంగ ప్రవేశం చేశారు వెంకటేశ్వర రావు. ఇంకా రంగస్థలం కళాకారుడైన పి. వెంకటేశ్వర రావు (90) అనారోగ్యం కారణంగా కన్నుమూసినట్లు కుటుంబీకులు తెలిపారు. మూడు రోజుల పాటు అస్వస్థతకు గురైన ఆయన కోఠిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య లక్ష్మి, ఐదుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు.