హీరో రామ్... కౌంటర్ అదిరిందిగా..!
ఎనర్జిటిక్ హీరో రామ్ - డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన బ్లాక్‌బష్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా అంచనాలను తలకిందులు చేసి.. సినీ పండితులు, ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. వీకెండ్‌లో మాత్రమే కాకుండా... వీక్‌డేస్‌లో కూడా హౌస్‌ఫుల్ కలెక్షన్స్ సాధిస్తూ రికార్డు స్థాయి కలెక్షన్స్ సాధిస్తుంది.
ఇదిలావుంటే.. ఇస్మార్ట్ శంకర్ పైన విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలపై రామ్ స్పందిస్తూ... హీరో హెల్మెట్ పెట్టుకోలేదు. హీరో స్మోక్ చేస్తున్నాడు, హీరో అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వలేదు…, ఎంతసేపూ…. ఇవే గాని, అక్కడ హీరో అడ్డమొచ్చిన వాడినల్లా చంపేస్తున్నాడని ఒక్కడు కూడా కంప్లైంట్ చేయడం లేదు. ప్రాణాలకు విలువ లేదు.
బాధాకరం అని తనదైన శైలిలో ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చాడు. మరో ట్వీట్లో.. గిది సినిమా రా బై.. సీన్ చూడండి.. సీన్ చేయకండి అన్నాడు. ఎవరు ఎలా విమర్శలు చేసినా... జనం మాత్రం ఇస్మార్ట్ శంకర్‌ని చూడటానికి ఎగబడుతున్నారు. బి, సి సెంటర్స్‌లో అయితే.. ఇస్మార్ట్ శంకర్ థియేటర్ దగ్గర హౌస్‌ఫుల్ కలెక్షన్స్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. ఫస్ట్ 3 డేస్‌లోనే డిస్ట్రిబ్యూటర్స్‌కి ఫ్రాఫిట్స్ ఇచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఇక ఫుల్ రన్‌లో ఎంత కలెక్ట్ చేస్తాడో చూడాలి.