శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : సోమవారం, 19 డిశెంబరు 2016 (16:21 IST)

విదేశీయుల కోసం సినిమా తీస్తున్నారు: నటి ఇంద్రజ

ఇప్పుడు కథలు మారిపోయాయి. ఒకప్పుడు మన కల్చర్‌కు తగినట్లు సినిమాలు వచ్చేవి. అవి మన రాష్ట్రంలోని వారు చూసేట్లుగా ఉండేవి. మన కల్చర్‌ను భారత్‌లోని ఇతర భాషలవారికి చూపించేవారు. ఒక్కోసారి అక్కడి కథలు మనవారికి

ఇప్పుడు కథలు మారిపోయాయి. ఒకప్పుడు మన కల్చర్‌కు తగినట్లు సినిమాలు వచ్చేవి. అవి మన రాష్ట్రంలోని వారు చూసేట్లుగా ఉండేవి. మన కల్చర్‌ను భారత్‌లోని ఇతర భాషలవారికి చూపించేవారు. ఒక్కోసారి అక్కడి కథలు మనవారికి పరిచయం చేసేవారు. ఇప్పుడు మన కథలను విదేశీయుల కోసం తీయాల్సివస్తుందని నటి ఇంద్రజ అన్నారు. చాలా కాలం తర్వాత ఇంద్రజ శతమానం భవతిలో నటించింది. 
 
ఈ చిత్రం గురించి ఆమె మాట్లాడుతూ.. విదేశాల్లో మన తెలుగువాళ్లు ఎక్కువైపోయి అక్కడంతా తెలుగు రాష్ట్రాల్లా తయారయ్యాయి. వీటిని ఆధారంగా చేసుకుని దిల్‌రాజు టైటిల్‌కు తగ్గట్టే చాలా గొప్ప సినిమా చేశారు. విదేశాలకు తమ పిల్లలను పంపి బాధపడే తల్లిందండ్రులు దిల్‌రాజుకి ధన్యవాదాలు చెబుతారని వ్యాఖ్యానించింది.