సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 23 నవంబరు 2017 (14:38 IST)

పబ్లిసిటీ కోసం నన్ను వాడుకుంటారా? : నగ్మా మండిపాటు

ఐటం గర్ల్ రాయ్ లక్ష్మీ హీరోయిన్‌గా నటించిన చిత్రం "జూలీ 2". ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ చిత్రంలోని పాటలను ఇప్పటికే సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా, అవి సంచలనం సృష్టించాయి. ఈ పాటల్

ఐటం గర్ల్ రాయ్ లక్ష్మీ హీరోయిన్‌గా నటించిన చిత్రం "జూలీ 2". ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ చిత్రంలోని పాటలను ఇప్పటికే సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా, అవి సంచలనం సృష్టించాయి. ఈ పాటల్లో హీరోయిన్ రాయ్ లక్ష్మీ తన అందాలను పూర్తిగా ఆరబోసింది.
 
అయితే, ఇక్కడ చెప్పుకోవాల్సిన ఓ విషయం ఏమిటంటే... కేంద్ర సెన్సార్ బోర్డు ఛైర్మ‌న్‌గా ఎన్నో నీతులు వ‌ల్లించిన పహ్ల‌జ్ నిహ్లానియే ఈ చిత్రాన్ని నిర్మించడం గమనార్హం. ల‌క్ష్మీరాయ్ చాలా బోల్డ్‌గా న‌టించిన ఈ సినిమా విడుద‌ల‌కు ముందే మంచి హైప్ సాధించింది. ఈ హైప్ స‌రిపోలేదునుకున్నాడో ఏమో, ప‌బ్లిసిటీ కోసం ప‌హ్లాజ్ ఇటీవ‌ల ఓ బాంబ్ పేల్చాడు.
 
ఈ సినిమా ద‌క్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఓ తారామ‌ణి క‌థ అని ప్ర‌క‌టించాడు. అయితే ఆమె పేరు వెల్ల‌డించ‌లేదు. అయినా ప‌హ్లాజ్ ప‌రోక్షంగా మాట్లాడింది న‌గ్మా గురించే అని క‌థ‌నాలు మొద‌ల‌య్యాయి. ఈ కథనాలపై న‌గ్మా స్పందించారు. 'ఇప్పుడు ఏమి చేయాలో తెలియ‌డం లేదు. ఇంత‌లా దిగ‌జారిపోతార‌ని అనుకోలేదు అని వ్యాఖ్యానించారు. 
 
'నా గు రించి ఓ సినిమా వస్తోందని మొదటిసారిగా వింటున్నాను. ఇంతవరకూ నాకెవరూ చెప్పలేదు. 'పద్మావతి' సినిమా మీదే ఇప్పుడందరి దృష్టీ ఉంది కనుక తమ సినిమా పబ్లిసిటీ కోసం ఇలా నా పేరు వాడుకుంటున్నారేమో నాకు తెలీదు. సినిమా చూడకుండా మాట్లాడటం పద్ధతి కాదు. చూశాక మాట్లాడదాం' అని చెప్పుకొచ్చింది. కాగా, నగ్మా ఇపుడు కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్న విషయం తెల్సిందే.