ఆ రూమర్ వచ్చాక... సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నా.. నటి యమున

తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయినటువంటి ''పుట్టింటి పట్టుచీర'', దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ''మామగారు'' ''ఎర్రమందారం'', ''బ్రహ్మచారి మొగుడు'' వంటి సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్న నటి యమ

chitra| Last Updated: శనివారం, 20 ఆగస్టు 2016 (14:57 IST)
తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయినటువంటి ''పుట్టింటి పట్టుచీర'', దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ''మామగారు'' ''ఎర్రమందారం'', ''బ్రహ్మచారి మొగుడు'' వంటి సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్న నటి యమున. ఆ తర్వాత ''ఎదురులేని మనిషి'', ''భగీరథుడు'', ''మనసు పిలిచింది''లాంటి సినిమాలలో సహాయనటిగా నటించారు. కన్నడ సినిమాలలో హీరోలు శివరాజ్ కుమార్, రవిచంద్రన్ సరసన హీరోయిన్‌గా నటించారు.

బుల్లితెరలో ఈటీవీలో ప్రసారమైన ''అన్వేషణ'' సీరియల్లో కూడా నటించింది. కాగా, ఈ హీరోయిన్ 2011లో బెంగుళూరు నగరంలో ఐటిసి రాయల్ గార్డెనియా (సెవెన్ స్టార్)లో హైటెక్ వ్యభిచారం చేస్తూ సీసీబీ పోలీసులకు దొరికిపోయిన సంగతి తెలిసిందే.

కానీ ఓ హోటల్‌లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడడంతో అప్పట్లో యమునపై మాత్రం రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన యమున... ఆ రోజు జరిగిన సంఘటన ఇప్పటికీ నన్ను నీడలా వెంటాడుతుందని... అసలు నేను ఆ హోటల్‌కి వెళ్లలేదని... తనపై లేనిపోని నింద‌లు వేశారని వాపోయింది.

నిజంగా తాను వెళ్లింది సీసీపీ ఆఫీస్‌‌కే కాని ఐటీసీ హోటల్‌కి కాదని అన్నారు. ఆ రూమర్ వచ్చిన తర్వాత జీవితంపై విరక్తి కలిగిందని... ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నానని.. అప్పుడైనా తనపై పడ్డ మచ్చ చెరిగిపోతుందని భావించి, ఆస్తులు నా పిల్లలపై రాసి నిజంగా చనిపోవాలని డిసైడ్ అయ్యానని బాధపడ్డారు. కానీ భగవంతుడు తన పిల్లల కోసం తనని బతికించడాని మనోధైర్యాన్ని ఇచ్చాడని వెల్లడించింది.దీనిపై మరింత చదవండి :