ఆది పినిశెట్టి అడ్వెంచర్ ఘోస్ట్ ఎంటర్‌టైనర్ "మరకతమణి"
'సరైనోడు'లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రంలో వైరం ధనుష్ పాత్రలో అందరిని మెప్పించిన ఆది పినిశెట్టి హీరోగా, నిక్కిగర్లాని హీరోయిన్‌గా చేస్తున్న చిత్రం "మరకతమణి". ఇటీవలే 'మలుపు'లాంటి కాన్సెప్టెడ్
'సరైనోడు'లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రంలో వైరం ధనుష్ పాత్రలో అందరిని మెప్పించిన ఆది పినిశెట్టి హీరోగా, నిక్కిగర్లాని హీరోయిన్‌గా చేస్తున్న చిత్రం "మరకతమణి". ఇటీవలే 'మలుపు'లాంటి కాన్సెప్టెడ్ కమర్షియల్ హిట్ సాధించిన ఆదిపినిశెట్టి, నిక్కి గర్లాని మరోక్కసారి జంటగా చేసిన మరకతమణి యెక్క మెదటిలుక్‌ని ఇటీవలే విడుదల చేశారు.
చాలా ఇంట్రస్టింగ్‌గా ఉందని అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తమిళంలో రెండు సూపర్ హిట్ చిత్రాలకి వర్క్ చేసిన ఏఆర్‌కే.శరవణన్ దర్శకత్వం చేస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదల నిర్మాతలు సన్నాహలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రిషి మీడియా, శ్రీ చక్ర ఇన్నోవేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ 'సరైనోడు' వంటి సూపర్‌బ్లాక్‌బస్టర్ చిత్రంలో వైరం ధనుష్‌గా తిరుగులేని స్టైలిస్ పాత్రలో అలరించిన ఆది పినిశెట్టి హీరోగా నటించిన చిత్రం మరకతమణి. ఈ చిత్రం యోక్క ఫస్ట్‌లుక్‌కి టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. మలుపువంటి సూపర్ హిట్ చిత్రంలో జంటగా నటించిన ఆది పినిశెట్టి, నిక్కి గర్లానిలు నటించిన ఈ చిత్రం చాలా ఇంట్రస్టింగ్‌గా ఉండటమే కాకుండా అడ్వంచర్ ఘెస్ట్ ఎంటర్‌టైనర్‌గా తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతుంది. ఈ చిత్రం మార్చిలో విడుదలకి సన్నాహలు చేస్తున్నాము.
ఈ చిత్రానికి 'కబాలి' మ్యూజిక్ దర్శకుడు సంతోష్ నారాయణ్ అసిస్టెంట్ దిబు థామస్ తొలిసారిగా మ్యూజిక్ చేస్తున్నారు. అలాగే కబాలి సింగర్ అనిల్ కామరాజ్ ఈ చిత్రంలో నటించటంతో పాటు ఓ సూపర్ సాంగ్ పాడారు. తమిళ, తెలుగు బాషల్లో ఓకేసారి విడుదల చేస్తున్నాము. కొటా శ్రీనివాసరావు ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అలాగే సూపర్ కమెడియన్ బ్రహ్మానందం నవ్వులు కురిపించారు. ఈ చిత్రం అందరిని సర్‌ప్రైజ్ చేస్తుందనటంలో సందేహం లేదు" అన్నారు.