అడివి శేష్ ‘డెకాయిట్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసింది
Updated: Sat, 9 May 2026 (17:57 IST)
Adivi Sesh, Mrunal Thakur
అడివి శేష్ మరోసారి డిజిటల్ స్పేస్‌పై తనకున్న పట్టుని నిరూపించారు. ఆయన నటించిన యాక్షన్ థ్రిల్లర్ డెకాయిట్ ఓటీటీలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ చిత్రం మే 8, 2026న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన వెంటనే ఇండియా వైడ్ నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది.
థియేటర్లలో విజయవంతమైన ప్రదర్శన అనంతరం ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్పేస్‌లో కూడా భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన లభిస్తోంది.
మంచి కంటెంట్‌ను ఎంపిక చేసుకోవడంలో అడివి శేష్‌కు ఉన్న విజన్ ని మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. విభిన్న కథలు, బలమైన కథనాలతో ఆయనకు ఉన్న క్రేజ్ డెకాయిట్‌తో మరింత బలపడింది.
ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించగా, ఇద్దరి నటన సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, జైన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్కర్ల వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు.
దర్శకుడిగా పరిచయమైన షనీల్ డియో ఈ చిత్రాన్ని స్టైలిష్‌గా, గ్రిప్పింగ్‌గా తెరకెక్కించారు. సినిమాటోగ్రాఫర్ ధనుష్ భాస్కర్ విజువల్స్, కొదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్, భీమ్స్ సిసిరోలియో సంగీతం సినిమాకి మరింత బలం చేకూర్చాయి.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియా యార్లగడ్డ, సునీల్ నారంగ్ నిర్మించిన ఈ చిత్రంలో ఉన్న హై ప్రొడక్షన్ వాల్యూస్ డిజిటల్ స్క్రీన్‌పైనా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
థ్రిల్లింగ్ కథనం, అద్భుతమైన టెక్నికల్ వాల్యూస్‌తో డెకాయిట్ స్ట్రీమింగ్ చార్ట్స్‌ను షేక్ చేస్తోంది. మంచి కంటెంట్‌కు ఎప్పుడూ ప్రేక్షకాదరణ ఉంటుందనే విషయాన్ని ఈ సినిమా మరోసారి నిరూపించింది.
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
మరింత చదవండి