సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 ఆగస్టు 2023 (14:01 IST)

నేను భవిష్యత్తును ఊహించలేను.. అకీరాకు నటించడం ఇష్టం లేదు..

Akira nandan
ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు నార్వే నుండి షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతోంది.  ఈ ఫోటోలలో పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ వున్నాడు. ఈ ఫోటోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ ఫోటోలను చూస్తే..  అకీరా లుక్ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాడని అందరూ నమ్మేలా చేసింది. 
 
తన తండ్రిలాగే తెలుగు సినిమాల్లోకి అరంగేట్రం చేస్తాడని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఊహాగానాలకు ముగింపు పలికేందుకు అకీరా తల్లి రేణు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తన కొడుకు ప్రస్తుతం నటించడానికి ఆసక్తి చూపడం లేదని ఆమె పేర్కొంది. "అకీరాకు నటించడం లేదా హీరోగా చేయడంపై ఆసక్తి లేదు" అని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసింది.
 
ఇంకా ఆమె ఇలా రాస్తూ.. "నేను భవిష్యత్తును ఊహించలేను. కాబట్టి దయచేసి నేను నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైనా పోస్ట్ చేసిన ప్రతిసారీ ఊహాగానాలు చేయడం మానేయండి. అతను నటనలోకి రావాలని నిర్ణయించుకుంటే నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే మొదటి వ్యక్తిని నేనే" అంటూ వాగ్ధానం ఇచ్చింది.