ఆదివారం, 23 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 17 మే 2016 (13:00 IST)

కత్రినా కైఫ్, అలియా భట్ బాయ్ ఫ్రెండ్స్‌ను మార్చుకున్నారా? నిజమేనా?

బాలీవుడ్‌లో హీరోహీరోయిన్ల మధ్య బ్రేకప్ సంగతులు ప్రస్తుతం ఫ్యాషనైపోయాయి. అయితే ప్రస్తుతం బ్రేకప్ అయిన జంటలు వేరొక జంటను వెతుక్కునే పనిలో పడ్డారు. అందుకే బాలీవుడ్‌లో బాయ్‌ఫ్రెండ్స్‌ని మార్చేసే పద్ధతి వచ్చిందని సినీ పండితులు అంటున్నారు. తాజాగా రణబీర్ కపూర్, కత్రినాల ప్రేమాయణమే ఇందుకు ఉదాహరణగా నిలిచిపోయింది. అలియా భట్, కత్రినా కైఫ్‌లు బాయ్‌ఫ్రెండ్స్ మార్చుకున్నారని బిటౌన్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
రణబీర్ కపూర్‌కు కత్రినా దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ మల్హోత్రా కత్రినాకు బాగా క్లోజ్ అయినట్లు వార్తలు బిటౌన్లో షికార్లు చేస్తున్నాయి. నిజానికి రణబీర్, కత్రినా విడిపోవడానికి అలియాభట్ కారణమని టాక్ వస్తోంది. 
 
కానీ అది నిజం కాదని కత్రినా, అలియా తేల్చేశారు. కానీ ప్రస్తుతం అలియా భట్ బాయ్‌ఫ్రెండ్‌గా అందరికీ తెలిసిన సిద్దార్థ్ మల్హోత్రా కత్రినాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుందని.. కత్రినా బాంద్రాలో తీసుకున్న అపార్ట్‌మెంట్ కూడా మల్హోత్రా ఉండే అపార్ట్‌మెంటుకు చాలా క్లోజ్‌గా ఉంటుందని సినీ వర్గాల్లో టాక్. ప్రస్తుతం కత్రినా, సిద్ధార్థ్ కలిసి బార్ బార్ దేఖో సినిమాలో నటిస్తున్నారు. వారిద్దరూ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందని టాక్.