మంగళవారం, 14 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 19 నవంబరు 2016 (11:18 IST)

నోట్ల రద్దు మంచిది.. మోడీకి సపోర్ట్ చేద్దాం.. ప్రజలు సహకరించాలి : అలియా భట్

దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రద్దు చేయడం పట్ల బాలీవుడ్ నటి అలియా భట్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నల్లధనం అరికట్టేందుకు మోడీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్న

దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రద్దు చేయడం పట్ల బాలీవుడ్ నటి అలియా భట్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నల్లధనం అరికట్టేందుకు మోడీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. అందువల్ల ప్రతి ఒక్కరూ మోడీకి అండగా ఉండాలని, అదేసమయంలో ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని ఆమె కోరారు. 
 
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సహచర నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమాయణం సాగిస్తున్నట్టు వినికిడి. అయితే, ఒక వేళ తన లవ్ బ్రేకప్ అయితే ఎలా ఫీలవుతారు, ప్రవర్తిస్తారన్న అంశంపై ఆమె స్పందిస్తూ... "నేను 16 యేళ్ల వయసులో ఉన్నప్పుడు ప్రేమలో విఫలమయ్యా. ఆ బ్రేకప్‌ బాధలోంచి తేరుకోవడానికి స్నేహితులతో ఎక్కువగా గడిపేదాన్ని. కానీ ఇప్పుడు అలాంటిది జరిగితే విహార యాత్రలకు వెళ్తా లేదా నా పనిపై ఇంకాస్త ఎక్కువ దృష్టిపెడతా. 
 
ఓ వ్యక్తి నాకోసమే ఎక్కడైనా ఉంటే.. ఎప్పటికైనా తిరిగొస్తాడని నమ్ముతా. నా దృష్టిలో ప్రేమ అనే భావన రోజూ మారుతుంటుంది. ప్రేమ అనేది ఇద్దరు ప్రేమికుల మధ్యలో ఉన్నదే కాదు. స్నేహితుల మధ్య ఉండొచ్చు. నాకు నా పెంపుడు పిల్లిపై.. కాఫీపై కూడా ప్రేమ ఉంది'' అంటూ తనదైనశైలిలో ప్రేమ పాఠాలు చెపుతోందని చెప్పుకొచ్చింది.